logo
జాతీయం

హంగ్ దిశగా మధ్యప్రదేశ్ !

హంగ్ దిశగా మధ్యప్రదేశ్ !
X
Highlights

మధ్యప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలను చూస్తుంటే హంగ్ దిశగా పయనం చేస్తున్నాయి. అక్కడ బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ కు ...

మధ్యప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలను చూస్తుంటే హంగ్ దిశగా పయనం చేస్తున్నాయి. అక్కడ బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ కు మధ్య ‍హోరాహోరా మధ్య తీవ్ర ఉత్కంఠత పోటీ సాగుతోంది. అక్కడి ఫలితాలను బట్టి తప్పకుండ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. మధ్యప్రదేశ్ లో ఇద్దరు మంత్రులు వెనకంజలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ మాత్రం నెమ్మదిగా పుంజుకుంటున్నట్లు ఫలితాలు తెలుపుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కమల్ నాథ్ ఇంటి వద్ద సంబురాలు అంబరాన్ని అంటేలా టపాసులతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి ఉదయం 10.30 గంటల సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీకి పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. అప్పటికి పరిస్దితి బీజేపీకి - కాంగ్రెస్ కి మధ్య హోరాహోరిగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం ఎలాగైనా బీజేపీయే గెలుస్తుదని ధీమా గా ఉన్నట్లు తెలుస్తోంది. హంగ్ వస్తే.. బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటున్నారు.

Next Story