ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Highlights

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నెల్లూరి పవన్‌(21),...

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నెల్లూరి పవన్‌(21), కాకిలేటి కిరణి(22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే రెండు నెలల క్రితం పవన్‌ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం కిరణికి తెలిసి, మనోవేదనకు గురైంది.. దీంతో ప్రియుడి దగ్గరకు వచ్చి విచారించగా, తాను అనుకోని పరిస్థితుల్లో వేరే అమ్మాయిని వివాహం చేసుకోవలసి వచ్చిందని చెప్పాడు పవన్, ఈ నేపథ్యంలో మనస్థాపం చెందిన కిరిణి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది.. ఆమె ఆలా చెయ్యడంతో పవన్‌ తనపై ఎక్కడ కేసు అవుతుందోననే ఆందోళనతో అతను కూడా పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారిని రక్షించేందుకు 108లో చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories