Top
logo

తెలంగాణలో మరో నిరుద్యోగి భూమేష్ ఆత్మహత్య

Highlights

ఒక ఆత్మహత్య తెలంగాణలో సరికొత్త శకం లిఖించింది. ఇది గతం. శ్రీకాంతచారి రూపంలో సాక్షాత్కరించిన వాస్తవం. కానీ...

ఒక ఆత్మహత్య తెలంగాణలో సరికొత్త శకం లిఖించింది. ఇది గతం. శ్రీకాంతచారి రూపంలో సాక్షాత్కరించిన వాస్తవం. కానీ ఇప్పుడు అలాంటి చరిత్రే మళ్లీ పునరావృతం అవుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో మురళీ ఆత్మహత్యతో తెలంగాణలో పరిణామాలు ఎలా మారబోతున్నాయి.? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఉద్యమించి... కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమను గాలికొదిలేశారంటూ జేఏసీ అండతో నిరుద్యోగులు కదంతొక్కుతున్న ఈ సమయంలో ఈ ఆత్మహత్య జరగడంతో ఇలాంటి ప్రశ్నే ఉదయిస్తుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం లింబా గ్రామంలో యువకుడు భూమేష్‌ ఉరేసుకున్నాడు. ఎమ్మెస్సీ బీఈడీ చదివిన భూమేష్‌.... ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story