కేసీఆర్...గులాబీల మదిలో మెదలుతున్న బ్రాండ్‌ నేమ్‌

కేసీఆర్...గులాబీల మదిలో మెదలుతున్న బ్రాండ్‌ నేమ్‌
x
Highlights

టీఆర్ఎస్‌ 105 మంది అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. క్యాండెట్స్‌ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయినా, మనసులో మాత్రం ఏదో గుబులు. స్థానిక...

టీఆర్ఎస్‌ 105 మంది అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. క్యాండెట్స్‌ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయినా, మనసులో మాత్రం ఏదో గుబులు. స్థానిక వ్యతిరేకత కొంప ముంచుతుందేమోనన్న సంశయం. కానీ ఒక్క మాత్రం, తమను ముందుకు నడిపిస్తోందని వాళ్లంటున్నారు. ఆ ఒక్క ఆశ, అభ్యర్థుల శ్వాస....కేసీఆర్‌. తమ నియోజకవర్గంలో గులాబీ దళాధిపతి పర్యటిస్తే చాలు, పాజిటివ్‌ ఎనర్జీ వచ్చేస్తుందని వాళ్లు కలలు కంటున్నారు.

రకరకాల వ్యూహాల నేపథ్యంలో ఎనిమిది నెలల ముందుగానే, ఎన్నికలకు సైరన్ మోగించారు టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ఆత్మవిశ్వాసం కేసీఆర్‌ది. అదే కాన్ఫిడెన్స్‌తోనే అసెంబ్లీని రద్దు చేయడం, 105 మంది అభ్యర్థులను ప్రకటించడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఆ 105 మంది అభ్యర్థుల్లో చాలామందికి మాత్రం, గుండెల్లో గుబులు పెరుగుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి, తమపై ఏదో ఒకస్థాయిలో వ్యతిరేకత ఉంటుందని, గులాబీ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. అందులోనూ కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా స్థానిక ఎమ్మెల్యేపైనే బాణాలు ఎక్కుపెడుతోందని టెన్షన్‌ పడుతున్నారు. మహాకూటమిగా విపక్షాలు బరిలోకి దిగుతుండటంతో, టీఆర్ఎస్‌ క్యాండెట్స్, కాస్త టెన్షన్‌ పడుతున్నారు. అయితే, కేసీఆర్‌ తమ నియోజకవర్గంలో ఒక్కసారి పర్యటిస్తే చాలు, వ్యతిరేకత మొత్తం తుడిచిపెట్టుకుపోతుందన్న ఒకే ఒక్క ఆశతో ఉన్నామంటున్నారు అభ్యర్థులు. అంటే గులాబీ గెలుపు గుర్రాల ఏకైక ఆశ, శ్వాస కేసీఆర్.

కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే చాలు, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయని గులాబీ నేతల దీమా. నియోజకవర్గంలో పర్యటించి, మహాకూటమి అభ్యర్థిని తూర్పారబెడితే, ఇక విజయానికి తిరుగుడుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే కేసీఆర్‌ రాక కోసం ఎదురుచూస్తున్నారు. 2014 ఎన్నికల్లోనూ, ఒకే ఒక్కడుగా ఎన్నికల సంగ్రామంలో తలపడ్డారు కేసీఆర్. అన్ని నియోజకవర్గాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేసి, అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. కొత్తకొత్తవాళ్లకు టిక్కెట్లిచ్చినా, కేవలం కేసీఆర్‌ ఫోటో చూసి, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు జనం. ఇప్పుడు కూడా, కేసీఆర్‌ ఫోటోపైనే, కారు గుర్తుపైనే ఆశలుపెట్టుకున్నారు అభ్యర్థులు.

కేటీఆర్‌ కూడా కేసీఆరే తమ నినాదమని ఇది వరకే ప్రకటించారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలన్న స్లోగన్‌తోనే ముందుకెళతామన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడెవరు అని గులాబీ నేతలు ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. కేసీఆర్‌తో పోటీపడదగ్గ నాయకుడెవరని, మహాకూటమికి సవాల్‌ విసురుతూ, జనంలో చర్చ రేకెత్తిస్తున్నారు. కేవలం తాను రంగంలోకి దిగితే, వాతావరణం మొత్తం పాజిటివ్‌గా మారుతుందన్న కాన్ఫిడెన్స్‌తోనే, కేసీఆర్‌ కూడా సాహసోపేతంగా సిట్టింగ్‌ అభ్యర్థులనే రేసులో ఉంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories