logo
జాతీయం

పాక్‌ ఆహ్వానాన్ని సుష్మా తిరస్కరణ

పాక్‌ ఆహ్వానాన్ని సుష్మా తిరస్కరణ
X
Highlights

పాకిస్థాన్‌లో ఏర్పాటుచేస్తున్న కర్తార్‌పుర్ నడవా భూమి పూజకు తప్పకుండా రావాలని దేశ విదేశాంగమంత్రి సుష్మా...

పాకిస్థాన్‌లో ఏర్పాటుచేస్తున్న కర్తార్‌పుర్ నడవా భూమి పూజకు తప్పకుండా రావాలని దేశ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ మర్యాద పూర్వకంగా ఆహ్వనించారు. కాని సుష్మాస్వరాజ్ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తన బదులు ఇద్దరు కేంద్రమంత్రులు హర్ సిమ్రత్ కౌర్ బదర్, హర్ దీప్ సింగ్‌పూరీ హాజరవుతారని తెలిపారు. పాక్‌ విదేశాంగ మంత్రి మహమూద్‌ ఖురేషీ ఆహ్వానిస్తూ ట్లీట్టర్లో పెట్టారు దాని సుష్మా స్పందిస్తూ నేనే మొట్టమొదలు ఒ‎ప్పుకున్న పనుల వల్ల నేను రాలేకపోతున్నా అని స్పష్టం చేశారు. భారత సిక్కు యాత్రికులు పాక్‌లోని గురుద్వారా దర్బార్‌ను దర్శించుకొనేందుకు సులభంగా వెళ్లడానికి ఈ నడవా ఉపయోగపడనుంది. నవంబరు 28న పాకిస్థాన్‌లో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఈ నడవాకు భూమిపూజ చేయనున్నారు.

Next Story