టెలికాం చరిత్రలో జియో సంచలనం..4జీ ఫోన్లు ఉచితం

Highlights

టెలికాం చరిత్రలో జియోతో సంచనాలు సృష్టించిన రిల‌యెన్స్... మ‌రో అద్భుతానికి తెరలేపింది. అదిరిపోయే ఫీచ‌ర్ల‌ు ఉన్న 4జీ ఫోన్‌ను ఉచితంగా ఇస్తామని...

టెలికాం చరిత్రలో జియోతో సంచనాలు సృష్టించిన రిల‌యెన్స్... మ‌రో అద్భుతానికి తెరలేపింది. అదిరిపోయే ఫీచ‌ర్ల‌ు ఉన్న 4జీ ఫోన్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఆగ‌స్ట్ 24 నుంచి బుకింగ్స్ ప్రారంభించి...సెప్టెంబర్ నుంచి డెలివరీ చేయబోతోంది. అంతేకాదు... జియో ఫోన్ ద్వారా టీవీ కేబుల్ ప్ర‌సారాల‌ను కూడా అందించబోతోంది.
అవును మీరు విన్నది నిజమే. రిలయన్స్ కంపెనీ కొద్ది రోజుల్లో జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ను ఉచితంగానే అందించబోతోంది. 4జీ జియోఫోన్‌ను ఉచితంగా అందిస్తామని ముంబైలో జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో గ్రూప్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. ఈ ఫోన్‌ ద్వారా జీవితకాలం పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌, అపరిమిత డేటాను అందిస్తామని చెప్పారు. అన్ లిమిటెడ్ డేటా కోసం నెలకు 153 రూపాయలతో రీఛార్జ్‌ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. అయితే ఉచిత ఆఫర్ ను మిస్ యూజ్ చేయొద్ద‌న్న కార‌ణంతో 1500 రూపాలయల్ని సెక్యూరిటీ డిపాజిట్ గా తీసుకుంటామని ముఖేష్ అంబానీ చెప్పారు. డిపాజిట్ ను మూడేళ్ల త‌ర్వాత తిరిగి చెల్లిస్తామ‌ని అన్నారు.
జీయో 45జీ ఫ్రీ ఫోన్ బుకింగ్స్ ఆగస్టు 24 ప్రారంభిస్తారు. సెప్టెంబ‌ర్ నుంచి ఫోన్ల డెలివ‌రీ ఉంటుంది. ఫ‌స్ట్ క‌మ్‌.. ఫ‌స్ట్ స‌ర్వ్ బేసిస్‌లో డెలివ‌రీ చేస్తారు. మేడిన్‌ ఇండియాలో భాగంగా భారతీయ యువత ఈ ఫోన్‌ను తయారుచేసినట్లు ముఖేశ్‌ తెలిపారు. ముఖేశ్ కుమార్తె ఇషా, కొడుకు ఆకాశ్‌ అంబానీ కొత్త ఫోన్‌ ఫీచర్లపై డెమో ఇచ్చారు. వాయిస్‌ కమాండ్‌తో పని చేసే ఈ ఫోన్‌...22 భాషల్ని సపోర్ట్‌ చేస్తుంది. జియో యాప్స్‌ను కూడా ఇన్‌బిల్ట్‌ చేశారు. తొలివిడతలో 50 ల‌క్ష‌ల ఫోన్లను అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ారు. అలాగే జియో పాత ఆఫర్లు కూడా కొనసాగుతాయని చెప్పారు అంతేకాదు..జియో ఫోన్ ద్వారా టీవీ కేబుల్ ప్ర‌సారాల‌ను కూడా అందిస్తామని తెలిపారు. నెలకు 309 రూపాయలతో జియో ఫోన్ ద్వారా టీవీకి కేబుల్ కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉందని వివరించారు. ఈ కేబుల్‌తో జియో ఫోన్‌ను ఏ టీవీకైనా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. స్మార్ట్ టీవీలే కాదు.. సాధార‌ణ పాత టీవీల‌కు కూడా ఈ కేబుల్‌ను క‌నెక్ట్ చేయొచ్చ‌ని అంబానీ తెలిపారు. అలాగే జియో ఫోన్ స్క్రీన్‌పై రోజుకు మూడు నుంచి నాలుగు గంట‌ల పాటు న‌చ్చిన వీడియోల‌ను లార్జ్ స్క్రీన్ల‌పై చూసుకోవ‌చ్చ‌ు. వారం, రెండు రోజుల ప్యాకేజీల‌ను కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. వారానికి 54, రెండు రోజుల‌కు 24 రూపాయలువ‌సూలు చేస్తారు. రిల‌యెన్స్ సమావేశంలో కంపెనీ అధినేత ముకేష్ అంబానీ కంట‌త‌డి పెట్టారు. 40 ఏళ్ల‌లో రిల‌యెన్స్ సాధించిన ప్ర‌గ‌తిని చెప్పే సమయంలో ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. దీంతో ప్రేక్ష‌కుల్లో ఉన్న ఆయ‌న త‌ల్లి కోకిలా బెన్ కన్నీరు మున్నీరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories