ఐఫోన్ కోసం పెళ్లి కొడుకైన మహేష్

Highlights

ఐఫోన్.. ప్రపంచంలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫోన్ రిలీజవుతోందంటే చాలు, దానిని తొలుత తామే దక్కించుకునేందుకు పోటీపడే వారెందరో. దానికోసం ఎన్నో...

ఐఫోన్.. ప్రపంచంలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫోన్ రిలీజవుతోందంటే చాలు, దానిని తొలుత తామే దక్కించుకునేందుకు పోటీపడే వారెందరో.
దానికోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. మరెన్నో ఫీట్లు చేస్తున్నారు. మహారాష్ట్రలోనూ ఓ యువకుడు ఐ ఫోన్ కొనుగోలులో కొత్త పంథాను అనుసరించి వార్తల్లోకి ఎక్కాడు. ధానేకు చెందిన మహేష్ అనే యువకుడు.. ఐ ఫోన్ అంటే పడిచస్తాడు. మార్కెట్లోకి కొత్తగా ఏ మోడల్ వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తాడు. తాజాగా విడుదలైన ఐ ఫోన్ ఎక్స్‌పైనా మనసు పారేసుకున్నాడు. కానీ.. ఎప్పట్లా కాకుండా... ఈసారి ఫోన్ కొనుగోలుకు సరికొత్త పంథాను అనుసరించాడు. పెళ్లి కొడుకులా గుర్రమెక్కాడు. ఐ లవ్ ఐ ఫోన్ అనే ఫ్లెక్సీ చేతబట్టుకుని.. స్నేహితులతో కలిసి థానే వీధుల్లో గుర్రంపై ప్రయాణించాడు. పెళ్లి బారాత్ తరహాలో బ్యాండు మేళం మధ్య మొబైల్ మార్కెట్‌కు చేరుకున్నాడు. మొబైల్ కొనుగోలుచేశాక కూడా గుర్రంపై కూర్చుని ఆ ఫోన్ తో ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఈ తతంగాన్నంతా చూసిన థానే జనం విస్తుపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories