Top
logo

కోల్ కతా టెస్టులో టీమిండియా 172 ఆలౌట్

Highlights

కోల్ కతా టెస్ట్ మూడోరోజు ఆట భోజన విరామానికి ముందు ఆతిథ్య టీమిండియా 172 పరుగులకు ఆలౌటయ్యింది. ఓవర్ నైట్ స్కోరు...

కోల్ కతా టెస్ట్ మూడోరోజు ఆట భోజన విరామానికి ముందు ఆతిథ్య టీమిండియా 172 పరుగులకు ఆలౌటయ్యింది. ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్లకు 74 పరుగులతో మూడో రోజుఆట కొససాగించిన టీమిండియా కు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు సాహా, జడేజా, షమీ ప్రధానపాత్ర వహించారు. వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

నయావాల్ పూజారా 117 బాల్స్ ఎదుర్కొని 10 బౌండ్రీలతో కీలక హాఫ్ సెంచరీ సాధించాడు. సాహా 29, జడేజా 22, షమీ 24 పరుగులు సాధించారు. శ్రీలంక బౌలర్లలో లక్మాల్ 4 వికెట్లు, పెరెరా , షనక, గమాగే తలో రెండు వికెట్లు పడగొట్టారు. పేస్ బౌలింగ్ కు అనువుగా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ పైన టీమిండియా ఫాస్ట్ బౌలర్ల త్రయం షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ లకు చేతినిండా పనే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Next Story