logo
జాతీయం

బీజేపీ ఓటమిని ముందే ఊహించా:ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఓటమిని ముందే ఊహించా:ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X
Highlights

ఇక రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను దృష్యా బీజేపీ తప్పకుండా ఓటమి పాలవుతుందని ముందుగానే...

ఇక రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను దృష్యా బీజేపీ తప్పకుండా ఓటమి పాలవుతుందని ముందుగానే ఊహించానని ఆ పార్టీ రాజ్యసభ్యుడు సంజయ్ కకాడే ఎవరు ఉహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమిని ముందుగానే పసిగట్టానుకాని ఇంత ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయని మాత్రం అస్సలు ఊహించలేదని వెల్లడించారు. 2014లో ఏదైతే చెప్పి అధికారంలో వచ్చామో ఇప్పుడు దానిని వదిలి పెట్టామని, అందుకు ఈ ఓటమే నిదర్శనమన్నారు. ముఖ్యంగా రామమందిర నిర్మాణం విషయంలో, ప్రపంచంలోని అత్యంత భారీ విగ్రహాల ఏర్పాటు, అదే విధంగా నగరాల పేర్ల మార్పులపైనే భారతీయ జనత పార్టీ దృష్టీసారించందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే ముఖ్యంగా బీజేపీ ఓటమికి కారణాలని విశ్లేషించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తాము విఫలమయ్యామని తెలియజేశారు.

Next Story