వారెవ్వా... కొత్తగా ఉంది... కంటిన్యూ చేస్తే పోలా!!

వారెవ్వా... కొత్తగా ఉంది... కంటిన్యూ చేస్తే పోలా!!
x
Highlights

బైక్‌లను నడిపించేటప్పుడు.. హెల్మెట్ ధరిస్తాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగినా.. అవి మన ప్రాణాన్ని కాపాడుతుంది. కానీ అవే హెల్మెట్లు...

బైక్‌లను నడిపించేటప్పుడు.. హెల్మెట్ ధరిస్తాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగినా.. అవి మన ప్రాణాన్ని కాపాడుతుంది. కానీ అవే హెల్మెట్లు ఇప్పుడు పంట చేలల్లో పనిచేసేవారికి ఉపయోగపడుతున్నాయి. వారి ప్రాణాలనూ రక్షిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా.. అచ్చంగా పొలంలో పనిచేసే కూలీలే. హెల్మెట్లు ధరించి మరీ కూలీ పనిచేస్తున్నారు. పత్తి పొలంలో చేతికొచ్చిన పత్తిని ఏరుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ హెల్మెట్లు పెట్టుకుని పంట పొలాల్లో పనిచేయడం సాధారణంగా మారింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామాల శివారులో ఓ ప్రైవేటు గ్రానైట్‌ క్వారీ నడుస్తోంది. పెద్ద పెద్ద బండరాళ్లను తొలిచేందుకు క్వారీ నిర్వాహకులు పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఆ పెలుళ్ల ధాటికి.. రాళ్లు వచ్చి పక్కనున్న గ్రామాలు, పొలాల్లో పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎక్కడి నుంచి రాళ్లు పడతాయో తెలియక.. హెల్మెట్లు పెట్టుకుని పనిచేయాల్సి వస్తోంది.

క్వారీ నుంచి వచ్చే దుమ్మును, శబ్ధాలను, రాళ్లను ఎదుర్కొనేందుకు.. ఆత్మరక్షణ కోసం హెల్మెట్లు ధరిస్తున్నామని.. రైతులు చెబుతున్నారు. ఈ క్వారీ వల్ల చాలామంది పొలాలను అమ్ముకోవాల్సి వచ్చిందని.. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో క్వారీ నడుస్తుందని.. రైతులు ఆరోపిస్తున్నారు. తమ ప్రాణాలు పోతున్నాయని.. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమను క్వారీ నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories