logo
వ్యాపారం

22న బ్యాంకు సేవలు బంద్..!

Highlights

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు ఈనెల 22న సమ్మెతలపెట్టాయి. ఈ సమ్మెలో భాగంగా ...

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు ఈనెల 22న సమ్మెతలపెట్టాయి. ఈ సమ్మెలో భాగంగా చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపాయి. ఆ చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో పాటు, రుణ ఎగవేత, మొండి బకాయిల రద్దును వ్యతిరేకిస్తున్నారు. కాగా ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు సేవలు మాత్రం యథావిధిగా పనిచేయనున్నాయి.

Next Story