పసిడి కొనుగోళ్లు.. గతేడాదికంటే 15.4 టన్నులు తక్కువ..!

అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లలో కూడా భారత్ లో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ధరల పెరుగుదల, స్థానిక పరిస్థితులు ...
అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లలో కూడా భారత్ లో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ధరల పెరుగుదల, స్థానిక పరిస్థితులు మార్కెట్ పై ప్రభావం చూపాయి. గతేడాదితో పోల్చుకుంటే ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దాదాపు 15.4టన్నల బంగారం కొనుగోళ్లు తగ్గింది. ఈ త్రైమాసికం ఆరంభంలో కొనుగోళ్లు ఉత్సాహంగానే సాగినా.. అధిక మాసం కారణంగా మందగించాయి. ఈ మేరకు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఓ నివేదికలో పేర్కొంది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం క్రయవిక్రయాలపై గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ2 2018 పేరుతో డబ్ల్యూజీసీ నివేదిక రూపొందించింది. భారత్ లో గతేడాది ఇదే త్రైమాసికంలో 202.6 టన్నుల పసిడి విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మాత్రం 187.2టన్నుల కొనుగోళ్లు జరిగాయి. అంటే దాదాపు 8శాతం వ్యత్యాసం. అయితే నగదు పరంగా తీసుకుంటే.. గతేడాది రూ.52,692కోట్ల బంగారాన్ని ప్రజలు కొనగులు చేశారు. ఈ ఏడాది 52,750కోట్లుగా ఉంది. ధరలు పెరగడంతో తక్కు బంగారం కొనుగోలు జరిగినా... నగదు పరంగా ఈ ఏడాదే ఎక్కువగా ఉంది. అయితే 2018 ద్వితీయార్థంలో పండగ సీజన్లు, వర్షాలు సక్రమంగా పడటం వంటి కారణాల వల్ల బంగారం కొనుగోళ్లు పెరిగి అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
ఇవాళ గాంధీభవన్లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMTమోహన్ బాబుని ట్రోల్ చేస్తున్న సాయిబాబా భక్తులు
10 Aug 2022 3:15 PM GMT