logo
వ్యాపారం

సదస్సుకు హాజరయిన ఉపాసనా, నారా బ్రాహ్మణి.!

Highlights

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ పారిశ్రామికత సదస్సు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.. ఈ సదస్సుకు ప్రధాని...

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ పారిశ్రామికత సదస్సు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.. ఈ సదస్సుకు ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో పాటు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాల్గొంటున్నారు. ఇనె్వస్టర్లు, పారిశ్రామిక వేత్తలు, విజ్ఞానాధారిత ప్రదాన పరిశ్రమల ముఖ్య కార్యనిర్వాహణాధికారులు కూడా హాజరవుతున్నారు. ప్రపంచం నలుమూలల నుండి 160 దేశాల ప్రతినిధులు వస్తున్నారు. అందులో దాదాపు 10 దేశాల నుండి పూర్తిగా మహిళా బృందాలే రానున్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించడంలో భారత ప్రభుత్వం పక్షాన నీతి ఆయోగ్ ముఖ్య పాత్రను పోషిస్తోంది. కాగా ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఉపాసనా లు హాజరయ్యారు..

Next Story