టాలీవుడ్లో దుమారం రేపుతున్న గాయత్రి కామెంట్స్
ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క సినిమా ఛాన్స్ కావాలంటే , హీరోయిన్లు ఎవరెవరికో ఫేవర్ చేయాల్సిందేనా? ఫిదా ఫేం గాయత్రి...
ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క సినిమా ఛాన్స్ కావాలంటే , హీరోయిన్లు ఎవరెవరికో ఫేవర్ చేయాల్సిందేనా? ఫిదా ఫేం గాయత్రి గుప్త.. ఇండస్ట్రీపై చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హెచ్ఎంటీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన గాయత్రి... ఇండస్ట్రీలో బడాబాబులుగా చెలామణి అవుతున్న కొందరి బాగోతాలను బట్టబయలు చేసింది. ఇప్పుడు ఇదే మ్యాటర్ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపుతోంది. ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎక్కడికెళ్లినా అదే సమస్య అంటారనీ, ఛాన్స్ తమకేమిస్తావని వెకిలి ప్రశ్నలు వేస్తారంటూ ఫైర్ అయింది.
ఆ అవకాశం ఇస్తేనే సినిమా ఛాన్స్. సినిమాల్లో ఒక్క ఛాన్స్ కావాలంటే ఏదో ఒకటికి వదులుకోవాల్సిందేనా? హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఏ అవకాశం కావాలన్నా, ఎదురయ్యే ఇబ్బందులెన్నో. తనకు కూడా అలాంటి చేదు అనుభవాలే ఎదరయ్యాయని చెబుతుంది గాయత్రి. సినిమాల్లోకి ఎంట్రీ పాస్ కావాలంటే, ఛాన్స్ ఇచ్చేవాళ్లకి ఇంకేదో ఇవ్వాల్సిందేనా? లేదంటే ఆఫర్ అందుకోలేరా?
మూవీ కేవలం సినిమానే కాదు క్యాస్టింగ్ కౌచ్‌కి వెండి తెర రూపం. అందుకే సినిమాల్లోకి రావాలంటే, అమ్మాయిల్ని భయపెడుతున్నారు. కేవలం హీరోయిన్లే కాదు, డైరెక్టర్లు, డాన్సర్లు, ఆఖరికి పాటల రచయితలుగా ట్రై చేసే విమెన్‌కి కూడా ఛాన్స్ కోసం ఏదో కోల్పోకపోతే, అవకాశాన్నే కోల్పోయే పరిస్థితొస్తోందని చెబుతుంది గాయత్రిగుప్త.
కోరిక తీర్చందే కొన్నిసార్లు హీరోయిన్గా ఛాన్స్‌లు రావు. కొందరు దర్శకులు కాఫీకి పిలుస్తారు. బయట కలుద్దామంటారంటూ. గాయత్రి ఇండస్ట్రీలో కొందరి గురించి ఇరగదీసింది. తాను కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ దుస్థితిని ఎండగట్టింది. ఆఫరిస్తే ఏమిస్తావనే ప్రశ్న టాప్ హీరోయిన్లకి పెద్దగా ఎదురుకాకున్నా, తనలాంటి అప్ కమ్మింగ్ హీరోయిన్స్ మాత్రం, అలాంటి ప్రశ్నలే ఫేస్ చేస్తున్నారని, అలా నచ్చని వాళ్లు అవకాశాలను జార విడుచుకుంటున్నారని చెబుతుంది గాయత్రి.
స్వాతినాయుడు, మాధవీలత, ఇప్పుడు గాయత్రిగుప్త. మనసు చంపుకోలేక ఎందరో గుట్టు చప్పుడు కాకుండా బండి లాగుతున్నారని హెచ్ఎంటీవీతో తన మనోభావాలను పంచుకుంది గాయత్రి. తనలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్స్ తక్కువ మంది ఉంటారని, తాను మాత్రం అలాంటి వాటిని ఏమాత్రం క్షమించనని హెచ్ఎంటీవీతో చెప్పుకుంది.
కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నాను కాబట్టే... గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడ్డానని తన బాధలు చెప్పుకొచ్చింది. తాను ఏ మూవీ యాక్సెప్ట్ చేసినా భయం కొద్ది ముందే కొన్ని కండీషన్స్‌కు ఒప్పుకోనని చెబుతానంది. “కమిట్మెంట్స్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే పడుకోవడం లాంటివి ఉంటే ఆ సినిమా చేయను అని తేల్చిచెబుతానంది మొదట్లో నోనో అన్నవాళ్లు... సినిమా మొదలైన తర్వాత కెలకడం మొదలు పెట్టేవారని గాయత్రి గుప్తా చెప్పింది.
తనది అరొగాన్స్ అని చాలా మంది అంటారనీ, కానీ ఆరొగెన్స్ కాదు, సెల్ప్ రెస్పెక్ట్ అంటోంది గాయత్రి. తన ఫోటో చూసి ఎంతో మంది అడిగారనీ, వన్నైట్కి అడిగినంత ఇస్తానన్న వాళ్లూ ఉన్నారని చెప్పుకొచ్చిందీ నటి. కన్సిడర్ చేస్తే కోట్లు సంపాదించొచ్చు అని ఉచిత సలహా ఇచ్చిన వాళ్లను ఏమాత్రం మొహమాటం లేకుండా వదిలేశానని చెప్పారు గాయత్రి. కోట్లు, ప్యాలెస్‌లు సంపాదించడం తన యాంబిషన్ కాదంటోంది గాయత్రి.
మగవారితో కలివిడిగా ఉన్నంతమాత్రాన క్యారెక్టర్‌ను చెడుగా అర్థం చేసుకోవద్దని చెబుతోంది. సొసైటీ మారదని తెలిసి తానే రిజర్వ్డ్గా ఉంటున్నానంది. తేడాగా ప్రవర్తించే వాళ్ల నుంచి కాపాడుకునేందుకు పది కత్తులు కొన్నానంటోంది. ఈ డేరింగ్ గాళ్. ఇండస్ట్రీలో వేధింపులను చాలామంది పంటి బిగువున భరిస్తారు. అవకాశాలు, డబ్బుల కోసం రహస్యాలు దాచేస్తుంటారు. కొద్దిమంది మాత్రమే ఇలా ధైర్యంగా బయటపెడుతారని కుండ బద్ధలు కొట్టింది గాయత్రి.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT