జగన్ ను కలిసిన భానుమతి..!

Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిన్న రాప్తాడులో దివంగత గంగుల సూర్యనారాయణరెడ్డి (మద్దెలచెర్వు సూరి) భార్య భానుమతి కలిశారు.. భానుమతి, జగన్...

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిన్న రాప్తాడులో దివంగత గంగుల సూర్యనారాయణరెడ్డి (మద్దెలచెర్వు సూరి) భార్య భానుమతి కలిశారు.. భానుమతి, జగన్ తోపాటు కొంత దూరం పాదయాత్ర చేశారు.. కాసేపు విలేకర్లతో మాట్లాడిన ఆమె రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని జోస్యం చెప్పారు.. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ఏడాది నాటికి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని చెప్పారు.. అనంతపురం జిల్లాలో గంగుల ఫ్యామిలీకి ఎంత ఆదరణ ఉందొ అందరికి తెలిసిందేనని ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తన భర్త అకాలంగా ప్రజలకు దూరమయ్యారు.. అయన ఆశయాలకు తాను ఎల్లప్పుడూ కృషి చూస్తుంటానని అన్నారు.. కాగా పాదయాత్ర చేస్తున్న జగన్ కు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పార్టీ ఎదుర్కుంటున్న సమస్యలపై కొంత దృష్టిపెట్టాలని సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది.. అంతేకాకుండా పార్టీలో మీరు యాక్టీవ్ రోల్ పోషిస్తారా అన్న ప్రశ్నకు ఇలా బధులిచ్చారు.. తమ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పజెప్తే అది చెయ్యడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు..

Show Full Article
Print Article
Next Story
More Stories