ఫ్లిప్‌కార్ట్‌లో విలీనమైన ఈ-బే ఇండియా

Highlights

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ-బే ఇండియా విలీనం పూర్తయింది. ఇక నుంచి ఈబే.ఇన్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌లో ఓ భాగమని ఆ సంస్థ...

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ-బే ఇండియా విలీనం పూర్తయింది. ఇక నుంచి ఈబే.ఇన్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌లో ఓ భాగమని ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. కాగా, గత ఏప్రిల్‌లోనే దీనిపై ఒక ప్రకటన చేసింది. ఇప్పుడు దానిపై ఆ చర్చలు సాఫీగా పూర్తయినట్లు ప్లిప్ కార్ట్ తెలిపింది. ఈక్విటీ స్టేక్‌ మార్పిడిలో భాగంగా.. ఈ-బే ఫ్లిప్‌కార్ట్‌లో 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. దీంతో పాటు ఈ-బే ఇండియా బిజినెస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించింది. ‘ఈ ఒప్పందంతో ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ఈ-బే కస్టమర్లకు కొత్త షేర్ హోల్డర్స్ వస్తారని ఫ్లిప్‌కార్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందానికి మరో ఈ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ వెనుకడుగు వేసిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు నిలిపివేశామని, తాము స్వతంత్రంగానే సాగాలని నిర్ణయించుకున్నట్లు స్నాప్‌డీల్‌ సోమవారం వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories