ఖర్చు చుక్కలు చూపిస్తుంది... కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది!!

ఖర్చు చుక్కలు చూపిస్తుంది... కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది!!
x
Highlights

శాసన సభ ఎన్నికలు అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈసారి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. కరెంట్ అకౌంట్ ద్వారానే ప్రతి...

శాసన సభ ఎన్నికలు అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈసారి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. కరెంట్ అకౌంట్ ద్వారానే ప్రతి పైసా ఖర్చు చేయాలని ఆదేశించింది. 28లక్షలకు మించి ఖర్చు చేయవద్దని స్పష్టం చేసింది. నామినేషన్ డిపాజిట్ అమౌంట్ తోనే ఇది పరిగణలోకి వస్తుందని తెలిపింది. ఎన్నికలంటేనే నోట్ల ప్రవాహం... గ్లాసుల గల గలలు... బలం... బలగం చూపించుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. ఏటేటా ఎన్నికల వ్యయం తడిసిమోపెడవుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చు లక్షల నుంచి కోట్లకు చేరుపోతోంది. ప్రచారం కోసం నగదు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. డబ్బులు ఎదజల్లి ఓటర్లను కొనే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంటారు. కానీ ఈసారి శాసన సభ ఎన్నికల్లో అలాంటి పప్పులు ఏమి ఊడికేలా కనిపించడం లేదు.

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మునుపెన్నడూ లేని విధంగా ఈసీ కొత్త కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. అభ్యర్థి ప్రచారంలో ఖర్చు చేసేది పార్టీ ఫండ్ అయినా... దాతల విరాళాలు అయినా ఎన్నికల ఖర్చు కోసం అకౌంట్స్ తెరవాలని స్పష్టం చేసింది. ఏ అభ్యర్థి అయినా ఎన్నికల కమిషన్ సూచించిన 28 లక్షలకు మించి ఖర్చు చేసేందుకు వీలు లేదని అంటున్నది. 28 లక్షల్లో దేనికెంత ఖర్చు చేయవచ్చనేది మాత్రం అభ్యర్థి ఇష్టానికి వదిలేసింది. నామినేషన్ వేసేటప్పుడు చెల్లించే డిపాజిట్ అమౌంట్ నుంచి ఇది పరిగణలోకి వస్తుంది. డిపాజిట్ కింద మొదట 10వేలు చెల్లించాలి. అది కూడా కొత్తగా ప్రారంభించిన కరెంట్ అకౌంట్ నుంచి మాత్రమేనని అంటుంది ఈసీ. అయితే ఈ ఖర్చుల వివరాలు మాత్రం ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు అక్కడి స్థానిక ఖర్చులను బట్టి అంచనా వేస్తారు. వాహనాల అద్దె, క్యాంటీన్, భోజనాల ఖర్చులు, ప్రింటింగ్, ప్రచార సామాగ్రి వంటివి అర్బన్ ప్రాంతాల్లో , రూరల్ , సెమి రూరల్ ప్రాంతాల్లో ఒక్కో విధంగా ఉంటాయి. దీంతో వాటిని స్థానికంగా ఉండే ఆర్.వో.లే అంచనా వేసి లిస్ట్ వేస్తారు తప్ప రాష‌్ట్ర వ్యాప్తంగా దీనిపై ధరల పట్టిక అంటూ ఉందదని చెబుతున్నారు.

ఇక నామినేషన్ తో పాటు ఫారం 26 అఫిడవిట్ లో అభ్యర్థి పెండింగ్ నేర చరిత్ర వివరాలు తప్సనిసరిగా సమర్పించాలని ఈసీ రజత్ కుమార్ తెలిపారు. దాన్ని అభ్యర్థికి చెందిన పార్టీ పోలింగ్ కంటే రెండు రోజుల ముందు వరకు కనీసం మూడుసార్లైనా సర్క్యూలేషన్ కలిగిన పేపర్ లో, కేబుల్ టీవీలో ప్రచారం, ప్రసారం చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అభ్యర్థులకు బంధనాలు వేస్తున్నాయి. ప్రతి పైసాకు లెక్క చూపాలనడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఆచితూచి ఖర్చు చేయాలని యోచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories