వరుసగా మూడో సెషన్‌లో మార్కెట్లకు లాభాలు

Highlights

హయ్యర్ లెవెల్స్‌లో అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పాజిటివ్‌గా ఉన్న సూచీలు చివర్లో ప్రాఫిట్ బుకింగ్‌కు...

హయ్యర్ లెవెల్స్‌లో అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పాజిటివ్‌గా ఉన్న సూచీలు చివర్లో ప్రాఫిట్ బుకింగ్‌కు గురయ్యాయి. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ఓపెన్ కావడం దేశీయ మార్కెట్లను కొంతమేర కుంగదీసింది. ఓవరాల్‌గా సెన్సెక్స్‌ 24 పాయింట్లు పుంజుకోగా, NSE నిఫ్టీ 7 పాయింట్ల స్వల్పలాభంతో ముగిసింది.

గత వారం భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్‌మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో వరుసగా మూడో రోజూ లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివర్లో ఒత్తిడికి గురయ్యాయి. దీంతో స్వల్ప లాభాలను మాత్రమే సాధించగలిగాయి. ఆరంభంలో ఐటీ, మెటల్ రంగ షేర్ల కొనుగోళ్ళ జోరుతో ఒక దశలో సెన్సెక్స్ 31 వేల 937 పాయింట్ల ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. అదే బాటలో ఇంట్రాడేలో నిఫ్టీ 9 వేల 947 పాయింట్ల గరిష్ట స్థాయిని టచ్ చేసింది. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు, హైయర్ లెవల్స్‌లో ట్రేడర్ల లాభాల స్వీకరణతో ప్రారంభ లాభాలను కోల్పోయాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగ షేర్ల ప్రాఫిట్ బుకింగ్స్‌తో... ఒక దశలో సెన్సెక్స్ 31 వేల 714 పాయింట్ల ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. అదే బాటలో ఇంట్రాడేలో నిఫ్టీ 9 వేల 883 పాయింట్ల కనిష్ట స్థాయిని టచ్ చేసింది. ఓవరాల్ గా సెన్సెక్స్ 24 పాయింట్ల లాభంతో 31 వేల 795 పాయింట్ల దగ్గర ముగియగా, నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 9 వేల 904 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక ప్రధాన షేర్ల విషయానికొస్తే... ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఐడియా, వేదాంతా షేర్లు లాభపడగా సిప్లా, అదానీ పోర్ట్స్, ఏసీసీ, మారుతీ సుజుకీ, అరబిందో ఫార్మా షేర్లు నష్టాలను చవిచూశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories