ఆ ముఖ్యమంత్రి 13సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన..!

ఆ ముఖ్యమంత్రి 13సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన..!
x
Highlights

ట్రాఫిక్ నిబంధనలు సామాన్యులే ఉల్లంఘించడం తెలుసు కొందరికి కాని గిక్కడ ఓ ముఖ్యమంత్రి కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంలో అందరికంటే మొట్టమొదలు ఉన్నడంట....

ట్రాఫిక్ నిబంధనలు సామాన్యులే ఉల్లంఘించడం తెలుసు కొందరికి కాని గిక్కడ ఓ ముఖ్యమంత్రి కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంలో అందరికంటే మొట్టమొదలు ఉన్నడంట. అయితే ఏవరు ఆ ముఖ్యమంత్రి అనుకుంటుర్రా ఏంది..? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంలో ఫడణవీస్ ఫస్ట్ అట. ఆయన అందరికి కంటే ఏ నిర్ణయమైన వేగంగా తీసుకుంటాడు అని తెలుసు అలాగే ఫైళ్లు పెండింగ్ పడకుంగా వాటిని త్వరగా క్లియర్ చేస్తుంటారని మంచి పేరే ఉంది దేవేంద్ర ఫడణవీస్‌కు. ఆయన పాలన ఏంత ఫాస్ట్ గా ఉంటదో ఆయన కాన్వాయ్ కూడా అతి వేగంగా ర్రయ్ ర్రయ్ మని దూసుకెళ్తోంది. అయితే గి ఏడాది జనవరి 12, 2018 నుంచి ఆగస్టు 12, 2018 మధ్య బంద్రా ఓర్లీ సీ లింక్ మార్గంలో ఆయన వాహనాలు 13సార్లు మితిమీరిన వేగంతో వెళ్లినట్లు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో పక్కగా రికార్డ్ అయ్యిందంట. ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై ఈ కెమెరాలే చలాన్లు విధిస్తుంటాయి. పద్దతి ప్రకారం ఎక్కవ స్పీడూ పోయినందుకు రూ. 1000 జుర్మానా విధిస్తారు. ముఖ్యమంత్రికి చెందిన రెండు కార్లకు మొత్తం 13,000 జరిమానా విధించారు. సామాన్య పౌరులకు ఈ-చలాన్ మొత్తం చెల్లిస్తేతేనే ట్రాఫిక్ పోలీసులు విడిచిపెడుతారు. కానీ, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిన ఈ-చలాన్ల మొత్తాన్ని రద్దు చేశారు. గి ముచ్చట సమాచార హక్కు చట్టం( ఆర్‌టీఐ) దరఖాస్తు ద్వారా వెల్లడైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories