బాబు..కిలో డెల్ ల్యాప్ టాప్ ఎంత..?

Highlights

అదేంటీ ఈ మధ్య డెల్ ల్యాప్ టాప్ కేజీల్లెక్క అమ్ముతున్నారా..? అని అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. ఆ ప్రాంతానికి వెళితే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్...

అదేంటీ ఈ మధ్య డెల్ ల్యాప్ టాప్ కేజీల్లెక్క అమ్ముతున్నారా..? అని అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. ఆ ప్రాంతానికి వెళితే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు టన్నులు లెక్క అందిన కాడికి కొనుగోలు చేయోచ్చు.
సాధారణంగా పండగలకు పబ్బాలకు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కష్టమర్లను ఆకట్టుకునేందుకు దుస్తుల్ని కేజీల చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంటారు. అయితే ఇదే ఫందాను ఫాలో అయినట్లున్నారు. అందుకే దుస్తువులకు బదులు ల్యాప్ ట్యాపులు, ఫోన్లు, యాక్ససరీస్ ను కేజీల్లో అమ్మకాలు జరుపుతున్నారు. భారత దేశంలో అతిపెద్ద, చౌకైన ల్యాప్ టాప్ మార్కెట్ ఢిల్లీ నెహ్రూ మార్కెట్ . ఇక్కడ ఏ బ్రాండెడ్ ల్యాప్ టాప్ అయినా కిలో రూ.5 - 7వేలకే అమ్ముతుంటుంటారు. చీప్ గా దొరికిందని కేజీలకు, కేజీలు ల్యాప్ టాప్ లు కొనే బదులు ఒకటికి రెండుసా‍ర్లు పరీక్షించి చూసుకోవాలి. లేకపోతే వినియోగదారుడి చెవిలో పూలు పెట్టడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories