మార్చి 31 నాటికి ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీరు

మార్చి 31 నాటికి ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీరు
x
Highlights

గడిచిన టీఆర్ఎస్ పాలనలో ఎంతో ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథపై నేడు ప్రగతి భవన్లో తెలంగాణ ము‌ఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు....

గడిచిన టీఆర్ఎస్ పాలనలో ఎంతో ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథపై నేడు ప్రగతి భవన్లో తెలంగాణ ము‌ఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు సిఎం కెసిఆర్. 23968 ఆవాస ప్రాంతాలకు గానూ 23,947 ఆవాస ప్రాంతాలకు నీరు చేరుతుందని అధికారులు కెసిఆర్ కు వివరించారు. మరో 21 గ్రామాలకు మాత్రమే మిషన్ భగిరథ నీళ్ల అందాల్సి ఉందని తెలిపారు. జనవరి 10 లోపు అన్ని ఆవాసాలకు మంచి నీళ్లు అందలని సిఎం కెసిఆర్ అధికారులకు గడువు విధించారు. కాగా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతీ ఇంటికి నీరందించాలని కెసిఆర్ ఆదేశించారు. ప్రజల బోగోగుల కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా మిషన్ భగిరథ పథకాన్ని పూర్తి చేసి తీరాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories