కోమటిరెడ్డికి భారీ షాక్

కోమటిరెడ్డికి భారీ షాక్
x
Highlights

కాంగ్రెస్ పార్టీకి షాక్ లా మీద షాక్ తగులుతునే ఉన్నాయి. తాజాగా నల్లగొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కొలుకోలేని భారీ షాక్...

కాంగ్రెస్ పార్టీకి షాక్ లా మీద షాక్ తగులుతునే ఉన్నాయి. తాజాగా నల్లగొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కొలుకోలేని భారీ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాలో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌కు టాటా చెప్పి కారు ఎక్కనున్నారు. వరసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ఉన్న చిలకల గోవర్ధన్‌తో పాటు మరో సీనీయర్ నేత, ప్రముఖ న్యాయవాది ధరనికోట రాము నేడు ఆపద్దర్మ మంత్రి కల్వకుంట్ల రామారావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధంపుచ్చుకొనున్నారు. ఆపద్దర్శ మంత్రి జగదీశ్ రెడ్డి మంతనాలు జరపడంతో ఎట్టకేలకు వీరిరువురు కారుఎక్కడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఒకేసారి ఇద్దరు కారు గూటికి చేరడంతో టీఆర్ఎస్ అభ్యర్థి కంచెర్ల భూపాల్ రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలకు ఆకర్షితులై పార్టీలో భారీ వలసలు వచ్చిపడుతున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories