అవునా ఇది బీజేపీ స్కెచ్చా...? అసలేంటీ టికెట్‌ ఫార్ములా?

అవునా ఇది బీజేపీ స్కెచ్చా...? అసలేంటీ టికెట్‌ ఫార్ములా?
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఇంటికో టికెట్ ఫార్ముల పార్టీ అధ్యక్షుడికి కొత్త టెన్షన్ తెచ్చిపెడుతోంది. మాజీ డిప్యూటీ సీఎం భార్య పద్మిని రెడ్డి కమలం...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఇంటికో టికెట్ ఫార్ముల పార్టీ అధ్యక్షుడికి కొత్త టెన్షన్ తెచ్చిపెడుతోంది. మాజీ డిప్యూటీ సీఎం భార్య పద్మిని రెడ్డి కమలం పార్టీ గూటికి చేరారు. సంగారెడ్డి నియోజక వర్గం టికెట్ ఆశించిన ఆమె కాంగ్రెస్ పార్టీ ఇంటికో టికెట్ ఫార్ముల కారణంగా రూటు మార్చారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.... సంగారెడ్డి అభ్యర్థిగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇదే సరైన సమయంలో అని భావించిన పద్మిని రెడ్డి పార్టీ మారారు.

ఇదే విధంగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తనకి తన కుమారుడికి నాగార్జున సాగర్ మిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్నారు. ఇక మరో మాజీ మంత్రి డీకే అరుణ తనకి,తన కుమార్తెకు గద్వాల్, మక్తల్ టికెట్లు ఆశిస్తున్నారు..వీరితో పాటు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు ముషీరాబాద్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు... అనిల్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ టికెట్ల పై కన్నేశారు..ఐతే అంజన్ కుమార్ తన కుమారుడి టికెట్ కోసం...తాను ఎంపీ పోటీకి దూరంగా ఉండడానికి ఒప్పుకున్నట్లు సమాచారం..కానీ మిగితావారు ఒకే టిక్కెట్టు ప్రతిపాదనను అంగీకరించడం లేదు. రెండు టికెట్లు ఖచ్చితంగా కావాలని పట్టుబడుతున్నట్తు తెలుస్తోంది.

వారసులకు టికెట్ ఆశిస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ లు ఇస్తుందా...ఒకవేళ ఇవ్వకపోతే ఆ కుటుంబంలో టికెట్ ఆశిస్తున్న వారు పద్మిని రెడ్డి దారిలోనే ఇతర పార్టీలలోకి జంప్ అవుతారా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి... కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నట్లు స్పష్టంగా అర్ధమౌతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories