హర్మన్ ప్రీత్ కౌర్ కు బిగ్ బాష్ లీగ్ జాక్ పాట్

Highlights

భారత మహిళా టీ-20 కెప్టెన్ కమ్ డాషింగ్ ఆల్ రౌండర్ హర్మన్ ప్రీత్ కౌర్...జాక్ పాట్ కొట్టింది. ఆస్ట్రేలియా దేశవాళీ బిగ్ బాష్ లీగ్ లో....సిడ్నీ థండర్...

భారత మహిళా టీ-20 కెప్టెన్ కమ్ డాషింగ్ ఆల్ రౌండర్ హర్మన్ ప్రీత్ కౌర్...జాక్ పాట్ కొట్టింది. ఆస్ట్రేలియా దేశవాళీ బిగ్ బాష్ లీగ్ లో....సిడ్నీ థండర్ జట్టుకు ఆడుతున్న హర్మన్ ప్రీత్ కాంట్రాక్టును మరో రెండేళ్లుపాటు పొడిగించాలని..సిడ్నీ ఫ్రాంచైజీ నిర్ణయించింది. డిసెంబర్ 9 నుంచి ప్రారంభంకానున్న బిగ్ బాష్ మూడో సీజన్ లీగ్ ప్రారంభానికి ముందే...హర్మన్ ప్రీత్ కు తీపికబురు అందింది. సిడ్నీ థండర్ జట్టు సభ్యురాలిగా... హర్మన్ ప్రీత్ తొలిసీజన్లో 296 పరుగులు సాధించడంతో పాటు..ఆఫ్ స్పిన్నర్ గా ఆరు వికెట్లు పడగొట్టి...కీలక ఆల్ రౌండర్ గా గుర్తింపు సంపాదించింది. మహిళా ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా పై 115 బాల్స్ లో 171 పరుగుల సుడిగాలి సెంచరీతో హర్మన్ ప్రీత్ పేరు మార్మోగిపోయిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories