logo
జాతీయం

రాజస్థాన్‌ పగ్గాలు గహ్లోత్‌కే..!

రాజస్థాన్‌ పగ్గాలు గహ్లోత్‌కే..!
X
Highlights

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయభేరి మోగించిన విషయం...

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులు ఎవరనేదే తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాలను ఆయా రాష్ట్రాల్లో నిర్వహించారు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గహ్లోత్‌ను ఎంపీక చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేసులో ఇప్పటికే సచిన్ పైలట్, గహ్లోత్ లు ఢిల్లీకి పయనం అయ్యారు. రాహుల్ గాంధీతో బైటక్ అయ్యారు. అయితే వీరిద్దరిలో సిఎం ఎవరు అనేది రాహుల్ గాంధీ ప్రకటించినలేదు. అయితే వారి సమావేశం ముగిసిన తరువాత గహ్లోతే సీఎం అని సమాచారం అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనుంది. 67ఏళ్ల గహ్లోత్‌ రెండు సార్లు రాజస్థాన్‌ ముఖ్యంత్రిగా పనిచేశారు.

Next Story