ఏపీ బీజేపీలో ముదురుతున్న వర్గపోరు

ఏపీ బీజేపీలో ముదురుతున్న వర్గపోరు
x
Highlights

ఏపీ బీజేపీలో అధ్యక్ష పదవి ఎంపిక వివాదం వర్గపోరుగా మారింది. గ్రూపులుగా విడిపోయిన నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి మద్దతిస్తున్నారు. మాజీ మంత్రి కన్నాకు...

ఏపీ బీజేపీలో అధ్యక్ష పదవి ఎంపిక వివాదం వర్గపోరుగా మారింది. గ్రూపులుగా విడిపోయిన నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి మద్దతిస్తున్నారు. మాజీ మంత్రి కన్నాకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడంపై సోము వీర్రాజు వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించిన నేతలు .. భవిష్యత్‌ కార్యచరణ సిద్ధం చేసేందకు ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఇదే సమయంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో సోము వీర్రాజుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. అధిష్టాన నిర్ణయాన్ని సమర్దిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

విభేదాలు ముదురుతూ ఉండటంతో అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్తితో ఉన్న సోము వీర్రాజును బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే ఫోన్‌ లైన్‌లో అందుబాటులో లేకపోవడంతో సాధ్యం కాలేదు. అయితే సోము వీర్రాజు బెంగళూరులో ఉన్నట్టు అనుచరులు భావిస్తున్నారు. ఐతే పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని అంతా మీడియా స్పష్టేనంటూ ఐటీ కన్వీనర్ సత్యమూర్తి ప్రకటించారు. సోము వీర్రాజులో ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories