Top
logo

సన్నీలియోన్ హీరోయిన్ గా తెలుగు సినిమా

Highlights

శృంగార తార‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన సన్నీలియోన్.. ఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాల్లో ఐటమ్...

శృంగార తార‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన సన్నీలియోన్.. ఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో హాట్ హాట్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేస్తుంది. తాజాగా తెలుగులో రాజశేఖర్ నటించిన గరుడవేగ మూవీలోనూ ‘డియో.. డియో’ అంటూ ఐటమ్ బాంబ్ పేల్చింది. దీంతో తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించిన సన్నీ.. త్వరలోనే ఒక పూర్తిస్థాయి తెలుగు సినిమా చేయనుంది.

సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాలో సన్నీలియోన్ హీరోయిన్ గా నటిస్తోంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనుందట సన్నీ. ముంబైలో ప్రముఖ ట్రైనర్ సన్నీలియోన్ కు శిక్షణ ఇవ్వనున్నాడట. భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ అండ్ టీంకు సన్నీలియోన్ 150 రోజుల కాల్సీట్లను ఇచ్చినట్లు సమాచారం.

బాహుబలి, 2.0 సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి పనిచేయనున్నాయి. ఈ చిత్రంలో దాదాపు 70 నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఉంటాయని తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు. వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవనుంది.

Next Story