విజయ్ ఆత్మహత్యకు కారణమేంటి..భార్యతో వివాదమా..తండ్రితో వచ్చిన తేడాలా..?

ఒక మరణం ఎన్నో అనుమానాల్ని రేకెత్తిస్తోంది.. ఒక ఆత్మహత్య మరెన్నో సందేహాలను తెరపైకి తెస్తోంది. ఇంతకీ కమెడియన్...
ఒక మరణం ఎన్నో అనుమానాల్ని రేకెత్తిస్తోంది.. ఒక ఆత్మహత్య మరెన్నో సందేహాలను తెరపైకి తెస్తోంది. ఇంతకీ కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్యకు కారణమేంటి..? కుటుంబ కలహాలా..? ఆర్థిక సమస్యలా..? భార్యతో వివాదమా..? తండ్రితో వచ్చిన తేడాలా..? అసలు విజయ్ చావుకు ఎవరు కారణం..?
కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. విజయ్ చావుకు మీరు కారణమంటే మీరేనంటూ మామా కోడళ్ళు పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నారు. విజయ్ ఆత్మహత్యకు అతని భార్య వనితా రెడ్డే కారణమని విజయ్ తండ్రి సుబ్బారావు ఆరోపిప్తే వనితకూడా మామగారిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. విజయ్ చావుకు అతని తండ్రి సుబ్బారావే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదాలున్నాయన్న వనితా రెడ్డి ఇదే విషయంలో విజయ్ తండ్రితో చాలాసార్లు గొడవ పడ్డాడని తెలిపారు. కూతురి పేరుతో స్తలాన్ని రాయాలని తండ్రిని విజయ్ తరుచూ అడిగేవాడనీ ఈ గొడవల వల్లే విజయ్ ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించడానికే విజయ్ తండ్రి సుబ్బారావు తనపై ఆరోపణలు చేస్తున్నారన్న వనిత ఆ ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతానని అన్నారు.
మరోవైపు కూతురిని కలిసే విషయంలో విజయ్‌కు అతని భార్య వనితకు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. విజయ్ తండ్రి సుబ్బారావుతో వనితా రెడ్డి జరిగిన పోన్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది. విజయ్ తరుచూ కుమార్తె కుందనను కలుస్తానంటూ ఫోన్ చేస్తున్నాడని వనిత ఆయనకు చెబితే కొంత కాలం పాపను విజయ్ కలవకుండా చూడాలని సుబ్బారావు సూచించారు. అలాగే తనను విజయ్ బెదిరిస్తున్నాడని వనిత అంటే మరీ ఎక్కువ మాట్లాడితే కోర్టులో కలుసుకుందామని చెప్పమని సుబ్బారావు సలహా ఇచ్చారు.
మరోవైపు కొద్దిసేపట్లో విజయ్ సాయి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఈ సాయంత్రం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. విజయ్ సాయి మృతదేహానికి . హైదరాబాద్ ఉస్మానియాలో పోస్ట్‌మార్టం చేశాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి విజయ్ పార్థివ దేహాన్ని యుసఫ్ గూడలోని నివాసానికి తరలించారు. మృతదేహాన్ని కొద్దిసేపు ఫిలిం ఛాంబర్ లో ఉంచుతారు. అమెరికాలో ఉన్న విజయ్ సోదరి రావడం ఆలస్యం అవుతున్న కారణంగా ఇవాళే దహన సంస్కారాలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మరోవైపు విజయ్ భార్య వనితారెడ్డి అంత్యక్రియలకు వచ్చినా అడ్డుకునేది లేదని విజయ్ తండ్రి సుబ్బారావు అంటున్నారు. వారి మధ్య ఎన్ని గొడవలున్నా తాము సంస్కారంతోనే వ్యవహరిస్తామని చెప్పారు.
Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMTMohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్
26 May 2022 5:10 AM GMT
Clove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMTతెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMTబెంగళూరులో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
26 May 2022 11:38 AM GMT