ఎన్నికల నగారాతో దేశ దశ-దిశ మారుతోందా? ఐదు రాష్ట్రాలు ఏం చెబుతున్నాయి?

ఎన్నికల నగారాతో దేశ దశ-దిశ మారుతోందా? ఐదు రాష్ట్రాలు ఏం చెబుతున్నాయి?
x
Highlights

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత చరిత్ర లో..గత ఏడుదశాబ్దాల కాలానికి భిన్నంగా...దేశ దశదిశను మార్చే ఎన్నికలకు నగారా మోగింది. 2019 సార్వత్రిక...

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత చరిత్ర లో..గత ఏడుదశాబ్దాల కాలానికి భిన్నంగా...దేశ దశదిశను మార్చే ఎన్నికలకు నగారా మోగింది. 2019 సార్వత్రిక ఎన్నికల సరళిని.. తీవ్రంగా ప్రభావితం చేసే...నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. 123 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో ఐదేళ్లకు ఓసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించడం సాధారణ విషయమే.

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే...ప్రజల కోసం...ప్రజల కొరకు...ప్రజలే తమకు తాము ఎన్నుకొనే ప్రభుత్వాలను స్వేచ్ఛగా ఏర్పాటు చేసుకొనే అతిపెద్ద దేశం భారత్ మాత్రమే. భారత్ అంటే ...చీటికి మాటికి ఎన్నికలు నిర్వహించుకొనే దేశం మాత్రమే కాదు. ప్రజాభిప్రాయంతో...రాజకీయనేతల తలరాతను, దేశభవితవ్యానికి తగిన మార్గాన్ని ఏర్పాటు చేసుకొనే సత్తా కలిగిన దేశం. 2019 సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా, సెమీఫైనల్స్ సమరంలా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు....భారత ఎన్నికల సంఘం..నగారా మోగించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తిస్ ఘడ్ రాష్ట్ర శాసనసభల ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించింది.

2019 ఎన్నికలకు ముందే నాలుగు రాష్ట్రాల ఎన్నికల జరుగనుండటం...ఈ నాలుగు రాష్ట్రాలలోని మూడురాష్ట్రాలలో...అధికార బీజెపీ ప్రభుత్వాలే ఉండటంతో... ఇప్పుడు కీలకంగా మారాయి. ఇప్పుడు దేశంలోని రాజకీయ విశ్లేషకుల నుంచి పౌరుల వరకూ...నాలుగు రాష్ట్రాల ఎన్నికల గురించే చర్చించుకొంటున్నారు.
కమలనాథుల ఏలుబడిలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్ ఘడ్, హస్తం పాలనలో ఉన్న మిజోరం రాష్ట్రాల ఎన్నికల కార్యక్రమాన్ని ..భారత ఎన్నికల సంఘం ఖరారు చేసింది. అంతేకాదు...నవంబర్ 12 - డిసెంబర్ 7 తేదీలలోగానే ఈ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించడం, డిసెంబర్ 11న ఫలితాలు ప్రకటించడం చేయనున్నట్లు...భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రకటించారు.

దేశం నడిబొడ్డునే ఉన్న మధ్యప్రదేశ్ శాసనసభలోని 230 స్థానాలకు ఒకేదశలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 230 స్థానాలకు జరిగే ఎన్నికల్లో...అధికారం చేజిక్కించుకోవాలంటే...116 స్థానాలు అవసరం. ఈ మ్యాజిక్ ఫిగర్ కోసం అధికార బీజెపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మధ్యప్రదేశ్ లో 2003 నుంచి బీజెపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటూ వస్తోంది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలనాథులు భావిస్తుంటే..ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని...అధికారంలోకి రావాలని హస్తం పార్టీ కలలు కంటోంది.

అంతేకాదు...ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో అధికారం కోసం...అధికార పార్టీ బీజెపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సై అంటే సై అంటున్నాయి. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలకు జరుగబోయే పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారం అందుకోవాలంటే 101 స్థానాలు సాధిస్తే చాలు. మ్యాజిక్ ఫిగర్ 101 స్థానాల కోసం...ఇటు కమలనాథులు...అటు హస్తే వాసులు పోటీపడుతున్నారు. నాలుగేళ్ల కోసారి విలక్షణమైన తీర్పు ఇవ్వటంలో రాజస్థాన్ ఓటర్లు తర్వాతే ఎవరైనా. రాజస్థాన్ ఎన్నికలను సైతం సింగిల్ ఫేజ్ లోనే నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో సైతం...బీజెపీనే అధికార పక్షంగా ఉంది. మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉంది. బీజెపీ పాలిత రాష్ట్రాలలో...ప్రత్యర్థుల అనైక్యతే తన అధికారానికి ఆలంబనగా ఉంటూ అధికారం చెలాయిస్తున్న రాష్ట్రం చత్తిస్ ఘడ్. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండటంతో... ఈ రాష్ట్ర ఎన్నికలను రెండుదశలుగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 90 స్థానాలకు పోటీ జరుగుతుంటే...46 స్థానాలు సాధించిన పార్టీకి మాత్రమే పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. 2008, 2013 ఎన్నికలలో...ప్రతిపక్షాల చీలికల ఓట్లతో నెగ్గుతూ వచ్చిన రమణ్ సింగ్ ప్రభుత్వం...వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకోగలనన్న ఆత్మవిశ్వాసంతో పావులు కదుపుతోంది.

ిఇక...ఈశాన్యభారత్ కొసన ఉన్న మిజోరం అనగానే...వరుస విజయాలతో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కనిపిస్తుంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో...తొలిసారిగా అధికారం చేజిక్కించుకోవాలని.. కమలనాథులు కలలు కంటూ...వ్యూహాలు పన్నుతున్న ఏకైక రాష్ట్రం మిజోరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన ఒకటి రెండు రాష్ట్రాలలో ..ఈశాన్య భారత రాష్ట్రం మిజోరం ముందుగా గుర్తుకు వస్తుంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా...మిజోరం రాష్ట్ర శాసన సభలోని.. 40 స్థానాలకు సైతం ఎన్నికలు నిర్వహించబోతున్నారు.

21 స్థానాలు సాధించిన పార్టీ లేదా కూటమికి మాత్రమే అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు భిన్నమైన వాతావరణం, ఓటర్ల మనస్తత్వం....అత్యధిక అక్షరాస్యత.. మిజోరం ఎన్నికల తుదిఫలితాలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనువుగా మార్చుకోవాలని ప్రతిపక్షపార్టీలు చూస్తున్నాయి. నాలుగురాష్ట్రాల ఓటర్ల తీర్పు ప్రభావం...2019 సాధారణ ఎన్నికలపై... ఏమేరకు ఉంటుంది?...కేవలం ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల తుదిఫలితాలే...రానున్న కాలంలో దేశ దశ దిశను నిర్ణయించడంతో పాటు...భవితవ్యాన్ని నిర్ణయిస్తాయా?.. ఈ బిలియన్ డాలర్ల
ప్రశ్నలకు సమాధానాల కోసం...మరికొద్ది వారాలపాటు వేచిచూడక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories