SBI Special Offer: ఎస్బీఐ కస్టమర్లకి శుభవార్త.. వారికి సులువుగా 35 లక్షల రూపాయలు..!

* రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్' అనే సదుపాయంతో వినియోగదారులు రూ. 35 లక్షల వరకు లోన్‌ పొందవచ్చు.

R Tripura Malini
Published on: 16 Nov 2022 3:34 PM IST
With this facility called SBI Real Time Express Credit customers can avail Rs.35 lakhs can be obtained
X

ఎస్బీఐ కస్టమర్లకి శుభవార్త.. వారికి సులువుగా 35 లక్షల రూపాయలు

SBI Special Offer: మీకు ఎస్బీఐలో అకౌంట్‌ ఉందా అయితే ఈ విషయం తెలుసుకోండి. వాస్తవానికి ఎస్బీఐ వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి కొత్త సేవను ప్రారంభించింది. దీని కింద కస్టమర్లు ఇంట్లో కూర్చొని సులభంగా లోన్ పొందవచ్చు. 'రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్' అనే సదుపాయంతో వినియోగదారులు రూ. 35 లక్షల వరకు లోన్‌ పొందవచ్చు. ఎస్బీఐ దీన్ని YONO యాప్‌లో ప్రారంభించింది. ఈ ప్రత్యేక సదుపాయం గురించి వివరాలు తెలుసుకుందాం.

ఎస్బీఐ 'రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్' సౌకర్యాన్ని అందరు కస్టమర్‌లు ఉపయోగించుకోలేరు. దీని ప్రయోజనాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రక్షణ సేవల్లో పనిచేసే కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే సులభంగా రుణం తీసుకోగలుగుతారు. ఈ ప్రత్యేక సదుపాయం YONO యాప్‌లో అందుబాటులో ఉంది. క్రెడిట్ చెక్, అర్హత, ఇతర డాక్యుమెంట్ వెరిఫికేషన్ సహాయంతో ఇంట్లో కూర్చొని లోన్‌ పొందవచ్చు.

35 లక్షల వరకు ప్రయోజనం

ఎస్బీఐ ఈ సదుపాయం కింద మీరు 35 లక్షల వరకు రుణం తీసుకోగలుగుతారు. దీని కింద మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. క్రెడిట్ చెక్, అర్హత, రుణ మంజూరు, పత్రాల సమర్పణ వంటి అన్ని పనులు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా మాట్లాడుతూ "YONOలో అర్హత కలిగిన జీతభత్యాల కస్టమర్ల కోసం రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ లోన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో కస్టమర్లకు ఎటువంటి అవాంతరాలు లేకుండా డిజిటల్ పద్ధతిలో లోన్‌లను అందిస్తున్నాం. బ్యాంకింగ్‌ను సులభతరం చేయడానికి కస్టమర్లకు పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడానికి ఎస్‌బిఐ ప్రయత్నిస్తోంది" అని తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story