రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు..!

రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు..!
x
Highlights

దూరంగా ఉంటూ ఒకరికి ఒకరు సందేశాలను పంపించుకునే యాప్ లలో ఎక్కువగా వాడుకలో ఉన్నది వాట్సప్. ఈ యాప్ ఇప్పుడు కొంత మందికి చేదు కబురును తెలియజేస్తుంది....

దూరంగా ఉంటూ ఒకరికి ఒకరు సందేశాలను పంపించుకునే యాప్ లలో ఎక్కువగా వాడుకలో ఉన్నది వాట్సప్. ఈ యాప్ ఇప్పుడు కొంత మందికి చేదు కబురును తెలియజేస్తుంది. ఇప్పటివరకూ విండోస్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లో వాడుకలో ఉన్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ రేపటినుంచి పనిచేయదని స్పష్టం చేసారు. ఇప్పటి వరకూ చాలా సార్లు ఈ విషయం పై వాట్సప్ ప్రకటనలను కూడా జారీ చేసింది.

ప్రకటించిన విధంగానే రేపటి నుంచి విండోస్‌ మొబైల్‌ ఓఎస్‌ ఉన్న ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని ఆ సంస్థ మరోసారి స్పష్టం చేసింది. ఇదే నేపథ‌్యంలో మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి వాట్సాప్‌ యాప్‌ను తొలగించనున్నట్లు కూడా వాట్సాప్‌ తెలిపింది. కాగా 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఐఓఎస్‌ 8 , ఆండ్రాయిడ్‌ 2.3.7 ఓఎస్‌లు, అంతకు ముందు వచ్చిన ఓఎస్‌లు ఉన్న ఫోన్లలోనూ వాట్సాప్‌ పనిచేయదని ఆ సంస్థ స్పష్టం చేసింది.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories