వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే ఫీచర్! కాల్ వెయిటింగ్ ఆప్షన్!!

వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే ఫీచర్! కాల్ వెయిటింగ్ ఆప్షన్!!
x
Highlights

వాట్సాప్ సరికొత్త ఫీచర్ కాల్ వెయిటింగ్ ఆప్షన్!

వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటివరకూ వాట్సాల్ప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు వేరొకరు కాల్ చేస్తే కాల్ కట్ అయిపోయేది. తరువాత మిస్ కాల్ చూసుకుని తిరిగి అవతలి వారికి కాల్ చేయాల్సి వచ్చేది.ఇక ఆ ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టింది వాట్సాప్.

ఇకపై వాట్సాప్ కాల్ లో మాట్లాడుతున్నప్పుడు వేరే ఎవరైనా కాల్ చేస్తే ఆ కాల్ వినియోగదారులకు స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిని బట్టి కొత్తగా కాల్ చేస్తున్న వారితో మాట్లాడాలంటే వెంటనే ఆ కాల్ కి ఆన్సర్ చేయొచ్చు. మామూలు కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ వెయిటింగ్ ఆప్షన్ వస్తుంది. మనం ముందుగా మాట్లాడుతున్నా వారిని హోల్డ్ లో ఉంచి కొత్త వారితో మాట్లాడి.. తిరిగి పాత కాల్ మాట్లాడొచ్చు. కానీ, వాట్సాప్ కాల్ వెయిటింగ్ అశం ఇస్తున్నా.. ఇందులో కొత్తగా వచ్చిన కాల్ మాట్లాడాలంటే అప్పటివరకూ మనం మాట్లాడుతున్నా కాల్ కట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కొత్తగా వస్తున్నా కాల్ మాట్లాడాలని అనుకోక పొతే ఆ కాల్ కట్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఈ కొత్త కాల్ వెయిటిం ఆప్షన్ వాట్సాప్ వెర్షన్ 2.19.352 ఆండ్రాయిడ్ యాప్, 2.19.357, 2.19.358 ఆండ్రాయిడ్ బేటా యాప్ లలో ఇంస్టాల్ చేసుకోవచ్చు.

ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ వినియోగదారులకు వాట్సాప్ పంపించింది. ఒక వేళ మీరు ఇంకా దానిని అందుకోలేకపోయి ఉంటె ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇంస్టాల్ చేసుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..

ఈ ఫీచర్ ను ఇంస్టాల్ చేసుకున్న తరువాత వాట్సాప్ కాల్ మాట్లాడుతుండగా ఏదైనా కాల్ మనకి వస్తే స్క్రీన్ పై కాల్ వెయిటింగ్ అశం కనిపిస్తుంది. ఇందులో రెండు అషన్లు వస్తాయి. ఒకటి decline రెండోది end and accept. ఈ రెండు అప్షన్లలో మనకు కావలసింది ఎంచుకోవచ్చు. decline ఆప్షన్ ఎంచుకుంటే కొత్తగా కాల్ చేస్తున్న వారి కాల్ కట్ అయిపోతుంది. రెండో ఆప్షన్ end and accept ఎంచుకుంటే పాత కాల్ కట్ అయి కొత్త కాల్ కి కనెక్ట్ అవ్వవచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories