ఇదో నిద్రా 'బిగ్ బాస్'.. మీ ఇంట్లో హాయిగా నిద్రపోండి..లక్ష రూపాయలు సంపాదించండి!

ఇదో నిద్రా బిగ్ బాస్.. మీ ఇంట్లో హాయిగా నిద్రపోండి..లక్ష రూపాయలు సంపాదించండి!
x
Sleeping job Image curtsy : wakefit.co
Highlights

నిద్రపోండి చాలు డబ్బులిస్తామంటే.. ఎగిరి గంతేస్తారు కదూ.. ఇదిగో ఓ సంస్థ అటువంటి ప్రకటన చేసింది.. ఆ కథేమిటో మీరూ చూడండి!

హాయిగా భోంచేసి.. ఇష్టం వచ్చినంత సేపు నిద్ర పొతే ఎంత బావుంటుంది? అనుకోని వారు తక్కువే కదా. కానీ, నిద్ర పొతే కూడు ఎవరు పెడతారు? పోనీ ఆఫీసులో మధ్యాహ్నమైనా ఓ కునుకు తీస్తే భలే ఉంటుంది అనిపిస్తుంది. దానికీ కుదరదుగా.. సరే కష్టపడి ఎనిమిది గంటలూ పని చేసి ఇంటికి వచ్చి పాడుకుందాం కనీసం ఎనిమిది గంటలు అనుకుంటే దానికీ ఇబ్బందే. ట్రాఫిక్ తిప్పలు దాటి ఇంటికి చేరేటప్పటికి ముంచుకొచ్చే నీరసం. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఉండే బాధ్యతలు.. నిద్ర పోనీయవు. కానీ, నిద్ర పోవడమే ఓ ఉద్యోగంగా ఇస్తామని ఎవరైనా చెబితే మీరు వెంటనే చాలు వెటకారం అనేస్తారు కదూ.

అయితే, మీరు నిద్ర పొతే చాలు మీకు అక్షరాలా లక్ష రూపాయలిస్తాం అంటోంది ఓ సంస్థ. ఏమిటీ నమ్మలేకపోతున్నారా? ఇది నిజమేనండీ. వేక్ ఫిట్ అనే సంస్థ తమ పరుపులపై రోజూ నిద్రపోతే చాలు లక్ష రూపాయలిస్తామంటోంది. నిద్ర పోవడం అంటే అలా ఇలా కాదు రోజుకి 9 గంటల పాటు రాత్రి సమయం లో నిద్ర పోవాలి. లా ఓ వంద రోజులు మీరు నిద్రపోవాల్సి ఉంటుంది. వంద రోజులు మీరు అలా దిగ్విజయంగా నిద్ర పొతే మీకు లక్ష రూపాయలు ఇస్తామని వేక్ ఫిట్ ప్రకటించింది.

ఇదేదో భలే ఉందని అనుకుంటున్నారా? మీరు ఈ పని చేయడానికి ఎక్కడికీ వెళ్లనవసరం లేదు కూడానూ. మీ ఇంటికే పరుపు పంపించేస్తారు. దానిమీద రోజూ రారి సమయంలో కదలకుండా 9 గంటల పాటు పడుకోవాలి. భలే భలే అని మళ్ళీ గెంతులు వేస్తున్నారా? ఇక్కడ ఓ చిన్న మెలిక కూడా ఉంది. మీరు పడుకున్న సమయంలో దానిని వీడియో తీసి క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఆ కంపెనీకి పంపించాలి. చూడబోతే ఇదేదో నిద్రా బిగ్ బాస్ లా ఉంది కదూ. అవును బిగ్ బాస్ లో బాస్ చెప్పేవరకూ నిద్ర పోకూడదు. ఇక్కడ మాత్రం నిద్రపోవాల్సిందే 9 గంటల పాటు. వందరోజులు.

అదండీ సంగతి మరి మీరు ప్రయత్నిస్తారా? అయినా పడుకున్నందుకు పైసలిస్తామంటే, ఎవరన్నా వదిలేస్తారా అని మీరనుకుంటున్నారు కదూ. మారేందుకు ఆలస్యం వెంటనే wakefit.co వెబ్ సైట్ కి లాగిన్ అవ్వండి.. అప్లై చేయండి.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇంకా ఆవులిస్తూ చూస్తున్నారేమిటండీ.. వెంటనే ఆ పని కానీయండి మరి!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories