Union Budget 2020: బడ్జెట్ పదానికి అర్థం తెలుసా? బడ్జెట్ పత్రాలు బ్రీఫ్ కేసులో ఎందుకు తెస్తారు?

Union Budget 2020: బడ్జెట్ పదానికి అర్థం తెలుసా? బడ్జెట్ పత్రాలు బ్రీఫ్ కేసులో ఎందుకు తెస్తారు?
x
Highlights

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు బడ్జెట్ తయారీ, సంప్రదాయ హల్వా...

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు బడ్జెట్ తయారీ, సంప్రదాయ హల్వా వేడుక, బడ్జెట్ తయారీతో సంబంధం ఉన్న వారికి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఎవరితో సంబంధాలు లేకుండా ఉండటం వంటి ఎన్నో ఆసక్తికర అంశాలు ఉంటాయి.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 వార్షిక బడ్జెట్ ను రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం అయ్యాయి. ఇక బడ్జెట్ ప్రవేశాపెత్తబోతున్న తరుణంలో బడ్జెట్ కు సంబంధించి ఒక విశేషాన్ని మీమున్డున్చాబోతున్నాం. అదే..బడ్జెట్ ప్రవేశ పెట్టేముందు ఆర్ధిక మంత్రి ఒక లెదర్ బ్రీఫ్ కేస్ పట్టుకుని పార్లమెంట్ ముందు కనిపిస్తారు. అలా ఎందుకో తెలుసా?

బ్రిటిష్ సంప్రదాయం..

ఈ సంప్రదాయం 18వ శతాబ్దంలో మొదలైంది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం యూకేలో మొట్ట మొదటి బడ్జెట్ పత్రాలను తీసుకురావడానికి 1860లో ఈ బాక్స్ ను వాడారు. అప్పటి యూకే చాన్సలర్ విలియమ్ ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ ఒక చెక్క పెట్టెను ఇందుకోసం వాడారు. ఆ బడ్జెట్ పత్రాలను బ్లాక్ శాటిన్ తో కప్పి బాక్స్ లో ఉంచి తీసుకు వచ్చారట. ఇక అప్పటినుంచి బ్రిటిష్ బడ్జెట్ పత్రాలను పెట్టెలో తీసుకువెళ్ళడం సంప్రదాయంగా మారింది. అదే సంప్రదాయాన్ని భారత్ కూడా కొనసాగిస్తోంది.

బడ్జెట్ అనే పదం ఎలా వచ్చిందో తెలుసా?

బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ బౌగెట్ (Bougette) అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం చిన్న బ్యాగ్ అని. బడ్జెట్ ప్రవేశ పెట్టే బాక్సును యూకేలో బడ్జెట్ బాక్స్ అని పిలుస్తారు. భారత్‌లో బ్రీఫ్‌కేస్ అంటారు.

అక్కడ అలా చేస్తారు..

ప్రతి సంవత్సరం రెడ్ బాక్స్‌ను తదుపరి ఛాన్సులర్‌కు ఇచ్చే సంప్రదాయాన్ని యూకే పాటిస్తోంది. అయితే ఈ బాక్స్ చాలా పాతదిగా మారి, చిరిగిపోవడంతో 2011లో కొత్త దానిని తీసుకు వచ్చారు. 2011లో జార్జ్ ఓస్బోర్న్ కొత్త బడ్జెట్ బాక్స్ తెచ్చారు. యూకేలో మాత్రం బడ్జెట్ బాక్స్ నల్ల రంగులో ఉంటుంది. భారతదేశంలో మాత్రం మన ఆర్థికమంత్రులు ఎరుపు, నలుపు వంటి రంగు బ్రీఫ్‌కేస్ ఉయోగిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపయోగించిన బ్రీఫ్‌కేస్ మాత్రం యూకే నాటి గ్లాడ్‌స్టోన్ బాక్సును తలపించేలా నలుపు రంగు బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఉపయోగించారు. పి చిదంబరం బ్రిటిషర్స్ మాదిరి స్కార్లెట్ లెదర్ బ్రీఫ్‌కేస్‌తో కనిపించేవారు. అరుణ్ జైట్లీ 2015లో టాన్ బ్రీఫ్‌కేసుతో వచ్చారు. అలాగే, యూకేలో బడ్జెట్ బ్రీఫ్‌కేసును తదుపరి ఆర్థికమంత్రికి ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ, మనదేశంలో అటువంటి సంప్రదాయం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories