Union Budget 2020: మనదేశ గతిని మార్చిన కొన్ని బడ్జెట్లు ఇవే!

Union Budget 2020: మనదేశ గతిని మార్చిన కొన్ని బడ్జెట్లు ఇవే!
x
Highlights

కేంద్ర బడ్జెట్ కు వేళ దగ్గరకొచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్ధికమంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ బడ్జెట్ మీదే ఉంది. బడ్జెట్ లో పన్నులు తగ్గించాలని వేతన జీవులు కోరుతుంటే..

కేంద్ర బడ్జెట్ కు వేళ దగ్గరకొచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్ధికమంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ బడ్జెట్ మీదే ఉంది. బడ్జెట్ లో పన్నులు తగ్గించాలని వేతన జీవులు కోరుతుంటే.. ధరలు దిగొచ్చేలా చేయాలని సామాన్యులు ఆశిస్తున్నారు. ఆర్ధిక మాంద్యం పొంచి ఉన్న నేపధ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యెక పరిస్థితులలో మన దేశ బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉండబోతున్నయనేది అందర్నీ సస్పెన్స్ లో పెడుతోంది. ఇదిలా ఉంటె, ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెడుతూనే ఉంటారు. ఆ సమయంలో కొంత హడావుడీ జరుగుతుంది. ప్రతిపక్షాలు బాలేదని పెదవి విరవడం.. అధికార పక్షం దీనిని మించిన బడ్జెట్ లేదు..రాబోదూ అంటూ రాగాలు తీయడం మామూలే. కానీ, మన దేశ చరిత్రలో కొన్ని బడ్జెట్ లు మాత్రం చరిత్రలో నిలిచిపోయాయి. కొన్ని బడ్జెట్ లు దేశ ఆర్ధిక రంగాన్ని మలుపులు తిప్పితే, మరికొన్ని ఉత్పాదన రంగాన్ని ఉవ్వెత్తున పైకి తీసుకు వెళ్ళాయి. కొన్ని కేవలం సంక్షేమ బడ్జెట్ లుగా మిగిలిపోయాయి. అటువంటి బడ్జెట్ లను కొన్నిటి గురించి మీకోసం..

1950 ఫిబ్రవరి 28వ తేదీన నాటి ఆర్థిక మంత్రి జాన్ మత్తయి తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రణాళిక కమిషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది ఆ బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనే. అదే ఏడాది మార్చి నాటికి ప్రణాళిక కమిషన్ ఏర్పాటయింది.

♦ 1968 ఫిబ్రవరి 29న నాటి ఆర్థికశాఖ మంత్రి మొరార్జీ దేశాయ్(ఈయన మనకు పది బడ్జెట్లను ప్రవేశ పెట్టారు) ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉత్పాదక రంగానికి ఊపిరలూదినట్లుగా చెబుతారు. ఈ బడ్జెట్ ఫలితంగా దాదాపు అన్ని రంగాల్లోనూ ఉత్పత్తులు పెరిగి జీడీపీ పరుగులు పెట్టింది. ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరికింది.

♦ ఈనాటి 'జీఎస్టీ' మూలం అని చెప్పుకోదగ్గ బడ్జెట్ ను 1986 ఫిబ్రవరి 28న వీపీ సింగ్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ తో పరోక్ష పన్నులకు బీజం పడి, ఖజనాకు రాబడి పెరిగింది. ఈ బడ్జెట్లో వీపీ సింగ్ ప్రవేశ పెట్టిన పన్నుల మూల సూత్రాల మీదే ప్రస్తుత జీఎస్టీ బిల్లు రూపుదిద్దుకుందని చెబుతారు.

♦ 1991 జులై 24న నాటి మన్మోహన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ద్వారా ఎగుమతులు, దిగుమతుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.

♦ 1997 ఫిబ్రవరి 28న దేశానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడా బాబుల నివాసాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీయడానికి ఈ బడ్జెట్‌లో పలు అంశాలను పొందుపరిచారు.

♦ 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళిక కమిషన్ ను రద్దు చేసి దాని స్థానంలో నీటి అయోగ్ ను తీసుకువచ్చింది.

ఇలా వ్యవస్థను మలుపు తిప్పిన బడ్జెట్లు పోలిన బడ్జెట్ ఈసారి వస్తుందేమో వేచి చూడాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories