స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు చేదు వార్త!

స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు చేదు వార్త!
x
Highlights

తమ వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపుకుని.. క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లు చెల్లించే వారికి ఎస్బీఐ షాకిచ్చింది.

తమ వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపుకుని.. క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లు చెల్లించే వారికి ఎస్బీఐ షాకిచ్చింది. ఇప్పటివరకూ కార్డు ఉపయోగించి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు 0.75 శాతం డిస్కౌంట్ ఇచ్చేవారు. ఇకపై ఆ డిస్కౌంట్ ను ఇవ్వబోమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

'ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు ఒక విజ్ఞప్తి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సూచన మేరకు ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్లపై 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ స్కీమ్‌ను వెనక్కు తీసుకుంటున్నాం. 2019 అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది' అని ఎస్‌‌బీఐ పేర్కొంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి సంస్థ ఇప్పటికే మెసేజ్‌లు పంపింది.

ఇండియన్ ఆయిల్ కార్ప్ (IOC), భారత్ పెట్రోలియం కార్ప్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ (HPCL) కంపెనీలను భారత ప్రభుత్వం బ్యాంక్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపెవారికి 0.75 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని కోరింది. దీని ప్రకారం దాదాపు రెండేళ్ల నుంచి ఆ కంపెనీలు ఇంతవరకూ డిస్కౌంట్ ఇస్తూ వస్తున్నాయి. అయితే, ఫ్యూయెల్ రిటైల్ కంపెనీలు డిస్కౌంట్ కారణంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,431 కోట్లు నష్టపోయాయి. ఇందులో క్యాష్‌బ్యాక్ రూపంలో రూ.1,165 కోట్లు, బ్యాంకుల ఎండీఆర్ చార్జీల రూపంలో రూ.266 కోట్లు తగ్గాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.2,000 కోట్లకు చేరింది. దీంతో ఆ కంపెనీలు ఈ భారాన్ని భరించేందుకు సిద్ధంగా లేమంతున్నాయి. అందుకే కార్డులపై పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేవారికి ఇకపై డిస్కౌంట్ ఇవ్వబోమని ప్రకటించాయి. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలు లోకి రానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories