సెన్సెక్స్ రికార్డు లాభాలు.. ఎనిమిది కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద!

సెన్సెక్స్ రికార్డు లాభాలు.. ఎనిమిది కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద!
x
stock market bull run (representational image)
Highlights

కరోనా ఒత్తిడిలోనూ ఇండియాలోని స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. నిన్న (మంగళవారం, ఏప్రిల్ 7) స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్...

కరోనా ఒత్తిడిలోనూ ఇండియాలోని స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. నిన్న (మంగళవారం, ఏప్రిల్ 7) స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 1307 పాయింట్ల లాభం దిశలో మొదలైంది. దీంతో 28,898.36పాయింట్ల అదిరిపోయే ప్రారంభం దొరికింది. తరువాత ఒక దశలో 2,566.7 పాయింట్లు పెరిగి 30,157 వద్దకు చేరింది. ఇక ముగింపు సమయానికి 2,476.26 పాయింట్ల (8.97%) లాభంతో 30,067.21 వద్ద స్థిరపడింది.

అదేవిధంగా నిఫ్టీ కూడా 708.40 (8.76%) పాయింట్లు పెరిగి 8,792.20 పాయింట్ల వద్ద ముగిసింది. 2009 మే తరువాత ఒకేరోజులో ఇన్ని పాయంట్లు లాభపడటం రెండు సూచీలకూ ఇదే తొలిసారి.

సెన్సెక్స్ లో బ్యాంకింగ్ షేర్లు మెరిశాయి. మొత్తమ్మీద 30 షేర్లు అధిక లాభాలను మూటగట్టుకున్నాయి. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో నిన్న ఒక్కరోజే ఇన్వెస్టర్లు భారీ లాభాలు చూశారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఇన్వెస్టర్ల ఆస్తులు ఏకంగా రూ.7.86 లక్షల కోట్లు పెరిగాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.116 లక్షల కోట్లకు పెరిగింది. యివేటు బ్యాంకులు, ఫార్మా రంగాల షేర్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు సూచీలు భారీగా 11 శాతం వరకు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకులు 2.09 శాతం లాభపడ్డాయి.

- ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా షేర్లు పదిశాతానికి పైగా పెరిగాయి.

- బజాజ్‌ ఆటో, రిలయన్స్‌, హీరో మోటోకార్ప్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి.

- మరోవైపు ప్రపంచ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి. నిక్కీ (జపాన్‌) 2.01%, హాంగ్‌సెంగ్‌ (హాంకాంగ్‌) 2.12%, కోస్పి (దక్షిణ కొరియా) 1.77%, షాంఘై (చైనా) 2.05%, స్ట్రెయిట్‌ టైమ్స్‌ (సింగపూర్‌) 4.10% చొప్పున పెరిగాయి. ఐరోపా మార్కెట్లలో డాక్స్‌, ఎఫ్‌టీఎస్‌ఈ సూచీలు కూడా 2- 3% మేర లాభాలను చూశాయి.

- డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మంగళవారం 49 పైసలు పెరిగి 75.64 వద్ద ముగిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories