బడ్జెట్ ఎఫెక్ట్: స్టాక్ మార్కెట్లు డీలా!

బడ్జెట్ ఎఫెక్ట్: స్టాక్ మార్కెట్లు డీలా!
x
Highlights

బడ్జెట్ నేపధ్యంలో కొంత వరకూ లాభాలతో ఈ ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి స్టాక్...

బడ్జెట్ నేపధ్యంలో కొంత వరకూ లాభాలతో ఈ ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో భారీ నమోదవుతున్నాయి. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, శ్చాబులను పెంచినప్పటికీ.. దీన్ని ఐచ్చికంగా నిర్ణయించడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్సించడమే మార్గంగా భావించారు. కానీ, ఈ దిశగా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేకపోవడంతో సూచీలు ఒక్కసారిగా కిందికి జారిపోయాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 588 పాయింట్లు కోల్పోయి 40,185 వద్ద కొనసాగుతుండగా... నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 11,92 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో సెన్సెక్స్‌ 700పాయింట్లు పడిపోయింది. తరువాత కొంత పుంజుకుంది.

ఆదాయపన్ను చెల్లింపుదారుల పై వరాలు కురిపించిన బడ్జెట్

ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా బడ్జెట్‌- 2020-21లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఆదాయం రూ.5్‌ నుంచి '.ళ5లక్షలు ఉన్నవారికి 10శాతం పన్ను. రూ..5లక్షల నుంచి రూ.10లక్షల ఆదాయం ఉన్నవారికి 15శాతం పన్ను. రూ.0లక్షల నుంచి రూ12.5లక్షల వరకూ ఆదాయం అఆర్టించే వారికి 80శాతం పన్ను వర్తిస్తుందని కేంద్ర

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. రూ.15లక్షలకు పైగా ఆదాయం ఉంటే 80శాతం పన్ను చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు. కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్చికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories