SBI : ఇంట్లో నుంచే బ్యాంకింగ్ సేవలు పొందాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..

SBI : ఇంట్లో నుంచే బ్యాంకింగ్ సేవలు పొందాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..
x
Highlights

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమైన పనులు ఉంటేనే బయటికి వెళ్లాలని సూచిస్తోంది. అందుకే కాబోలో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు తమ కస్టమర్ల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుని కస్టమర్లు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా వీలైనన్ని బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఎస్‌బీఐ క్విక్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ గురించి ఇప్పుడు బాగా ప్రచారం చేస్తోంది.

ఒక్క మిస్డ్ కాల్ లేదా ఒక్క ఎస్ఎంఎస్‌ చేస్తే చాలు మనకు కావలసిన అనేక సేవల్ని మన ఫోన్‌లోనే పొందొచ్చు. ఇమెయిల్ ద్వారా అకౌంట్ స్టేట్‌మెంట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, మినీ స్టేట్‌మెంట్, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్, కార్ లోన్ ఫీచర్స్, రిజిస్ట్రేషన్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ప్రధాన మంత్రి సామాజిక భద్రతా పథకాలు, డీరిజిస్టర్, ఎడ్యుకేషన్ లోన్ సర్టిఫికెట్, ఏటీఎం కార్డు ఆన్ లేదా ఆఫ్ చేయడం, గ్రీన్ పిన్ జనరేట్ చేయడం, యోనో యాప్ డౌన్‌లోడ్ చేయడం ఇలాంటి సేవలన్నీ కూడా ఎస్‌బీఐ క్విక్ ద్వారా ఒక్క మిస్డ్ కాల్ కానీ, ఒక్క ఎస్ఎంఎస్ కాని చేసి పొందొచ్చు. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనికూడా లేదు ఈ ఫెసిలిటీ పొందాలనుకునే కస్టమర్లు మీ బ్యాంకు అకౌంట్‌కు ఫోన్ మొబైల్ నెంబర్ యాక్టివేట్ చేయడమే.


ఇక 'ఎస్‌బీఐ క్విక్' సేవలను పొందాలనుకునే వారు ఈ విధంగా తమ నంబరును రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. ముందుగా REG Account Number అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు మీరు రిజిస్టర్డ్ చేసుకున్న మొబైల్ నెంబర్‌ నుంచి సందేశం పంపాలి. మీ నంబర్ రిజిస్టర్ అయిందా లేదా తెలుసుకోవడానికి మీ నంబరుకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అనే సందేశం వస్తుంది. మీకు ఈ సేవలు అవసరం లేదు ఆపేయాలి అనుకున్నప్పుడు వెంటనే 09223488888 నెంబర్‌కు 'DREG' అని టైప్ చేసి పంపాలి. వెంటనే మీరు ఈ సేవలను నుంచి తప్పుకోవచ్చు. మొబైల్ లో మాత్రమే కాకుండా ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో కూడా ఈ సేవలను రిజిస్టర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం...ముందుగా మీరు మీ ఏటీఎం కార్డును స్వైప్ చేసి స్క్రీన్‌పైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఆ తరువాత ఎప్పటిలాగే మీ ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. వెంటనే స్క్రీన్‌లో ఒచ్చిన ఆస్షన్లలో Phone Banking Registrationపైన క్లిక్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత మీ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి ఫోన్ బ్యాంకింగ్ దరఖాస్తు పూర్తి చేసి ఇస్తే అప్పుడు బ్యాంకు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను కస్టమర్‌కు అందజేస్తుంది. దీంతో మీ ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ పూర్తైనట్టే.

ఇక ఎస్‌బీఐ క్విక్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ ద్వారా మీరు పొందే సేవలను తెలుకుందాం...

Generate ATM PIN : మీరు మీ కొత్త ఏటీఎం కార్డులు ఈ సేవల ద్వారా పిన్ ను జనరేట్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ లో PIN అని టైప్ చేసి ఆ తర్వాత మీ కార్డు నెంబర్ చివర్లో నాలుగు అంకెలు, అకౌంట్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు కలిపి 567676 నెంబర్‌కు పంపాలి. మీ ఫోన్ నెంబర్‌కు వన్ టైం పాస్ వర్డ్ ( OTP ) వస్తుంది.

SBI Balance Enquiry : మీ అకౌంట్ లో ఎంత నగదు ఉందో తెలుసుకోవాలనుకుంటే 'BAL' అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. లేదా 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. అలా చేస్తే వెంటనే మీ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

SBI E-Statement కోసం ESTMT అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ వస్తుంది.

Services కోసం HELP అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. SBI Mini Statement తెలుసుకోవాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ కానీ లేదా 'MSTMT' అని టైప్ చేసి సందేవం అయినా పంపాలి.

PM Social Security Scheme వివరాల కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి PMJJBY లేదా PMJJBY స్పేస్ అకౌంట్ నెంబర్ స్పేస్ నానిమీ రిలేషన్‌షిప్ స్పేస్ నామినీ ఫస్ట్ నేమ్ స్పేస్ నామినీ లాస్ట్ నేమ్ టైప్ చేసి 9223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

SBI Cheque Book Request కోసం "CHQREQ" అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు సందేశం పంపిస్తే మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. అప్పుడు CHQACCY6-అంకెలు అదే నెంబర్‌కు రెండు గంటల్లో పంపితే సరిపోతుంది.

SBI Loans వివరాల కోసం 'HOME' లేదా 'CAR' అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు కాల్ చేసి ఆఫర్లు తెలుసుకోవచ్చు.

ATM Card Blocking కోసం BLOCK అని టైప్ చేసి మీ కార్డులో చివరి నాలుగు నెంబర్లను కలిపి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories