ఎస్బీఐ: ఆ డెబిట్ కార్డులు డిసెంబర్ 31 తరువాత చెల్లవు!

ఎస్బీఐ: ఆ డెబిట్ కార్డులు డిసెంబర్ 31 తరువాత చెల్లవు!
x
Image source: SBI Twitter
Highlights

స్ట్రిప్ డెబిట్ కార్డులు డిసెంబర్ 31 తరువాత చెల్లవని ఎస్బీఐ తెలిపింది.

ప్రస్తుతం కొంతమంది ఖాతాదారుల వద్ద ఉన్న డెబిట్ కార్డులు డిసెంబర్ 31 తరువాత చెల్లవని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెబుతోంది. మాగ్నటిక్ టిప్ ఉన్న డెబిట్ కార్డులను ఈ నెల 31 లోగా తమ ఖాతా ఉన్న బ్రాంచ్ లలో ఇచ్చేసి, వాటి బదులుగా కొత్త కారులను పొందాలని ఎస్బీఐ సూచిస్తోంది.

మాగ్నటిక్ స్ట్రిప్ ఉన్న పాత కార్డులను ఆర్బీఐ సూచించిన భద్రతా నిబంధనలకు అనుగుణంగా చిప్ కార్డు లుగా మార్చనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. పాత కార్డులను తమ హోమ్ బ్రాంచ్ లో వాపసు చెయాయడం ద్వారా కొత్త కార్డులను ఎటువంటి రుసుము లేకుండానే పొందవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. ఈ విషయాన్నీ తన అధికారిక ట్విట్టర్ లో ఎస్బీఐ తెలిపింది.

గత సంవత్సరం ఆర్బీఐ అన్ని బ్యాంకులూ స్ట్రిప్ ఏటీఎం కార్డులను చిప్ ఏటీఎం కార్డులతో మార్పు చేయాలని సూచించింది. ఈ ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ 2019 చివరి వరకూ అన్ని స్ట్రిప్ కార్డులను బ్యాంకులు చిప్ కార్డులుగా మార్పు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తన ఖాతాదారులకు ఈ నెలాఖరు లోగా తమ కార్డులను మార్చుకోవాలని లేనిపక్షంలో తరువాత ఆ కార్డుల ద్వారా ఎటువంటి లావాదేవీలను నిర్వహించలేరని తెలిపింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories