Rupee against Dollar: రూపాయి మారక విలువ పతనం ఆందోళన కరం

Rupee against Dollar: రూపాయి మారక విలువ పతనం ఆందోళన కరం
x
Highlights

ఆసియా దేశాల్లో అన్ని కరెన్సీల కంటే భారత రూపాయి పతనం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. సౌత్ కొరియా వోస్, పాకిస్థాన్ రూపాయి ల తరువాత ఆసియా...

ఆసియా దేశాల్లో అన్ని కరెన్సీల కంటే భారత రూపాయి పతనం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. సౌత్ కొరియా వోస్, పాకిస్థాన్ రూపాయి ల తరువాత ఆసియా దేశాల్లో మన రూపాయి మాత్రమే జనవరి 2019 నుంచి ఎక్కువ క్షీణించింది.

రూపాయి ఎంత పడిపోయిందంటే..

గత సంవత్సరం జనవరి నుంచి మన రూపాయి అమెరికా డాలరుతో 2 శాతం మారకం విలువను కోల్పోయింది. అదే సమయంలో చైనా కరెన్సీ 0.4 శాతం పడిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. ఇక అమెరికా డాలరుతో పోలిస్తే ఇతర ఆసియా దేశాల కరెన్సీలు థాయి బాహ్త్ 6.3 శాతం, మలేషియా రింగిట్ 1.5 శాతం, పిలిఫ్పైన్స్ పెసో 3 శాతం పడిపోయాయి. గత ఏడాది కాలంగా చైనీస్ రెన్మింబీ 0.4 శాతం పడిపోయింది.

ఎందుకంటే..

భారత్‌లో ఆర్థికమాంద్యం ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉండటం వల్లే రూపాయి విలువ పడిపోయిందని ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ సంవత్సరంలో భారత్ స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధిలో భారీ పతనం కారణం కావచ్చని ఆర్ధిక వేత్తల అభిప్రాయం. దీని వలన కరెన్సీ పై ఒత్తిడి పెరిగిందని వారంటున్నారు. గతంలో 2008 లో ఇలాంటి ఒత్తిడికి గురైన రూపాయి 20 శాతం క్షీణించింది.

బంగ్లాదేశ్ టాకా రూపాయికంటే బావుంది..

ప్రస్తుత సమాచారం ప్రకారం భారత రూపాయి కంటే బంగ్లాదేశ్ టాకా విలువ బావుంది. కా గత 12 నెలల్లో 1.5 శాతం తగ్గింది. భారత రూపాయిని 100 బేసిస్ పాయింట్స్ అధిగమించింది. ఇకపోతే, పాకిస్తాన్ రూపాయి మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన తో, గత 12 నెలల్లో 9.5 శాతం మేర పడిపోయింది. డాలరు మారకంతో పాకిస్తాన్ రూపాయి 154.4 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏడాది క్రితం ఇది 139.8గా ఉంది. పాకిస్తాన్ తర్వాత దక్షిణ కొరియా కరెన్సీ వోన్ భారీగా పడిపోయింది. ఇది ఏడాదిలో 5 శాతం మేర పడిపోయింది. డాలరు మారకంతో ఇది 1,167.1 వద్ద ట్రేడ్ అవుతోంది.

వృద్ధి రేటు..

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని అంచనా.వేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతన్న దేశాల్లో భారత్ వృద్ధి రేటు 2019లో గణనీయంగా పడిపోయింది. కాగా, అందుతున్న సమాచారం ప్రకారం అత్యధిక ఆదాయం, ట్రేడ్ సెన్సిటివ్ సిటీలలో హాంగ్‌కాంగ్, సింగపూర్ ఉన్నాయి. చైనీస్‌కు వ్యతిరేకంగా ఆందోళనల కారణంగా హాంగ్‌కాంగ్, గ్లోబల్ ట్రేడ్ వ్యాల్యూమ్ తగ్గడంతో సింగపూర్‌లపై ప్రభావం పడింది.

దారుణంగా పాకిస్థాన్..

ఆసియా దేశాల్లో 2019లో పాకిస్తాన్ వృద్ధి రేటు గత ఏఢాది కంటే దారుణంగా పడిపోయే ఛాన్స్ ఉంది. 2018లో 5.5 శాతం వృద్ధి రేటు ఉండగా, అది ఈసారి 3.3 శాతానికి పడిపోనుందని అంచనా వేస్తున్నారు. కాగా, సౌత్ ఈస్ట్ ఆసియాలో మాత్రం వృద్ధి రేటు క్షీణత కాస్త తక్కువగా ఉంది. ఇండోనేషియా ఎకానమీ 5 శాతానికి పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఫిలిప్సీన్, వియత్నా, చైనా, బంగ్లాదేశ్‌లలో 50 బేసిస్ పాయింట్లు, 20 బేసిస్ పాయింట్లు, 40 బేసిస్ పాయింట్లు, 10 బేసిస్ పాయింట్లు, సౌత్ కొరియాలో 70 బేసిస్ తగ్గే అవకాశముందాని ఆర్ధిక వేత్తలు లెక్కలు కడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories