కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..అధిక ధరలు చెల్లించక తప్పదు

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..అధిక ధరలు చెల్లించక తప్పదు
x
Highlights

ప్రస్తుతం ఉన్న సెల్ ఫోన్ మీకు బోర్ కొట్టిందా, లాక్ డౌన్ తరువాత దాన్ని మార్చి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని కొందామనుకుంటున్నారా.

ప్రస్తుతం ఉన్న సెల్ ఫోన్ మీకు బోర్ కొట్టిందా, లాక్ డౌన్ తరువాత దాన్ని మార్చి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని కొందామనుకుంటున్నారా. అయితే మీరు ఖచ్చితంగా అధికధరలు చెల్లించాల్సిందే. ఎందుకంటే దేశంలో కొత్త జీఎస్టీ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడంతో కంపెనీలు ఈ ధర పెంచక తప్పలేదు. దీంతో చాలా మొబైల్ కంపెనీలు తమ ఫోన్లకు ధరలు పెంచేసారు. ఇప్పటికే షావోమీ, రియల్‌మీ లాంటి కంపెనీలు కొత్త ధరల్ని ప్రకటించినప్పటికీ మరికొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వాటి ధరలను ప్రకటించలేదు. రియల్ మీ, షావోమీ స్మార్ట్ ఫోన్ల ధరలు మోడల్ ని బట్టి, ఫీచర్స్ ని బట్టి రూ.500 నుంచి రూ.1000 మధ్య ధర పెరిగింది.

ఇక జీఎస్టీ అమలులోకి రాక ముందు నుంచే దేశంలో కరోనా వ్యాప్తి చెందడడంతో లాక్ డౌన్ ని అమలు చేసారు. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో మొబైల్ షాపులన్నీ కూడా మూసివేసారు. అంతే కాక అటు ఆన్ లైన్ షాపింగ్ లు కూడా జరగడం లేదు. దీంతో చాలా మందికి మొబైల్ ధరలు పెరిగిన సంగతి కూడా తెలియడం లేదు. కగా దేశంలో జీఎస్‌టీ భారం పెరగిపోవడంతో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ధరలు పెంచక తప్పలేదని చెపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ కొత్త ధరల్నివెబ్‌సైట్స్‌లో అప్‌డేట్ చేశాయి.

ఇక పెంచిన షావోమి స్మార్ట్ ఫోన్ ధరల పట్టికను చూసుకుంటే

స్మార్ట్‌ఫోన్ మోడల్ పాత ధరలు కొత్త ధరలు

రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ (6GB + 64GB) రూ.14,999 రూ.16,499

♦ రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ (6GB + 128GB) రూ.16,999 రూ.17,999

♦ రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ (8GB + 128GB) రూ.18,999 రూ.19,999

♦ రెడ్‌మీ 8ఏ డ్యూయెల్ (2GB + 32GB) రూ.6,499 రూ.6,999

♦ రెడ్‌మీ 8ఏ డ్యూయెల్ (3GB + 32GB) రూ.6,999 రూ.7,999

♦ రెడ్‌మీ నోట్ 9 ప్రో (4GB + 64GB) రూ.12,999 రూ.13,999

♦ రెడ్‌మీ నోట్ 8 ప్రో (6GB + 128GB) రూ.15,999 రూ.16,999

♦ రెడ్‌మీ నోట్ 8 ప్రో (8GB + 128GB) రూ.17,999 రూ.18,999

♦ రెడ్‌మీ నోట్ 9 ప్రో (6GB + 128GB) రూ.15,999 రూ.16,999

♦ రెడ్‌మీ నోట్ 8 ప్రో (6GB + 64GB) రూ.14,999 రూ.15,999

♦ రెడ్‌మీ నోట్ 8 ప్రో (4GB + 64GB) రూ.10,499 రూ.10,999

♦ రెడ్‌మీ కే20 ప్రో (6GB + 128GB) రూ.24,999 రూ.26,999

♦ రెడ్‌మీ కే20 ప్రో (8GB + 256GB) రూ.27,999 రూ.29,999

♦ రెడ్‌మీ నోట్ 8 (6GB + 128GB) రూ.12,999 రూ.13,999

♦ రెడ్‌మీ కే20 (6GB + 128GB) రూ.22,999 రూ.24,999

♦ రెడ్‌మీ కే20 (6GB + 64GB) రూ.19,999 రూ.21,999

♦ ఎంఐ ఏ3 (4GB + 64GB) రూ.11,999 రూ.12,999

♦ రెడ్‌మీ 8ఏ (2GB + 32GB) రూ.6,499 రూ.6,999

♦ రెడ్‌మీ 8ఏ (3GB + 32GB) రూ.6,999 రూ.7,499

♦ రెడ్‌మీ 7ఏ (2GB + 16GB) రూ.5,999 రూ.6,499

♦ రెడ్‌మీ 7ఏ (2GB + 32GB) రూ.6,199 రూ.6,699

♦ రెడ్‌మీ 8 (4GB + 64GB) రూ.7,999 రూ.8,999

Show Full Article
Print Article
More On
Next Story
More Stories