పవర్ ఫుల్ కెమేరాతో సంచలనం సృష్టిస్తున్న కొత్త రియల్ మీ XT

పవర్ ఫుల్ కెమేరాతో సంచలనం సృష్టిస్తున్న కొత్త రియల్ మీ XT
x
Highlights

రెడ్ మీ కి గట్టి పోటీదారుగా ఉన్న రియల్ మీ కంపెనీ XT పేరుతొ కొత్త ఫోన్ పరిచయం చేసింది. ఇప్పటివరకూ ఏ కంపెనీ మొబైల్ ఫోన్ లోనూ లేని విధంగా ఏకంగా 64 ఎంపీ కెమేరాతో ఈ ఫోన్ వస్తోంది.

రెడ్ మీ కి గట్టి పోటీదారుగా ఉన్న రియల్ మీ కంపెనీ XT పేరుతొ కొత్త ఫోన్ పరిచయం చేసింది. ఇప్పటివరకూ ఏ కంపెనీ మొబైల్ ఫోన్ లోనూ లేని విధంగా ఏకంగా 64 ఎంపీ కెమేరాతో ఈ ఫోన్ వస్తోంది. అన్ని కంపెనీలకు తన పవర్ ఫుల్ కెమేరాతో చెక్ పెడుతున్న ఈ XT ఎలా వుంది? ఏమిటీ అనేది తెలుసుకుందామా?

రియల్ మీ XT మూడు వేరియంట్లలో వస్తోంది. 4GB/64GB వేరియంట్ 15,999 రూపాయలుగానూ, 6GB/64GB వేరియంట్ 16,999 రూపాయలుగానూ, 8GB/128GB వేరియంట్ 18,999 రూపాయలుగానూ కంపెనీ నిర్ణయించింది. రెండు రంగుల్లో వస్తున్న ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, రియల్ మీ.కాం వెబ్ సైట్ల లో ఈనెల 16 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి.

పేటీఎం, యూపీఐ కొనుగోళ్ళ పై రెండు వేల వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది కంపెనీ. అంతేకాకుండా మొదటి 64 వేలమంది కస్టమర్లకు ఆరు నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ వారెంటీ ఇస్తోంది.

ఇక ఈ ఫోన్ ..

- ఆండ్రాయిడ్ 9 పై ఒఎస్ 6.0 తో పనిచేస్తుంది.

- 6.4 అంగుళాల సూపర్ అమోలేడ్ డిస్ప్లే

- ముందు వెనుకా గ్రిల్లా 5 ప్రొటెక్షన్

- స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్

- 64 ఎంపీ వెనుక కెమెరాఇదే కాకుండా 8, 2, 2, ఎంపీ కెమెరాలు వెనుకవైపు

- 16 ఎంపీ సేల్ఫీ కెమెరా

- 4000 ఎంఏ హెచ్ బ్యాటరీ

-3.5 ఎం ఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.0 వంటి అద్భుత ఫీచర్లతో వస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories