కాస్త తగ్గిన పెట్రోల్ ధరలు..స్థిరంగా డీజిల్ ధర!

కాస్త తగ్గిన పెట్రోల్ ధరలు..స్థిరంగా డీజిల్ ధర!
x
Highlights

పెట్రోల్ ధరలు ఈరోజు (13-12-2019) కాస్త తగ్గాయి. కాగా డీజిలు ధారల్లో మాత్రం మార్పు లేదు.

పెట్రోల్ ధరలు ఈరోజు తగ్గాయి. పెట్రోల్ ధరలు ఈరోజు (13-12-2019) కాస్త తగ్గుముఖం పట్టాయి.. మరో వైపు డీజిలు ధరలు మాత్రం మార్పులు లేకుండా నిలిచాయి.

హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే పెట్రోల్ ధర లీటరుకు 7 పైసలు తగ్గింది. దీంతో 79.69 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిలు ధర కూడా మార్పులు లేకుండా 72.07 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు 6 పైసలు తగ్గి 78.68 రూపాయలు గానూ, డీజిలు ధర నిలకడగా 71.02 రూపాయలు గానూ ఉన్నాయి. అమరావతి లోనూ పెట్రోల్ ధర లీటరుకు 6 పైసలు తగ్గి 79.25 రూపాయలుగానూ, డీజిలు ధర 71.15 రూపాయలుగా నిలిచాయి.

ఇక ఢిల్లీలోనూ పెట్రోల్ ధరలు కాస్త తగ్గాయి. డీజిలు ధర మారలేదు. ఇక్కడ పెట్రోల్ లీటరుకు 6 పైసలు తగ్గి 74.89 రూపాయల వద్దకు చేరింది. ఇక డీజిలు ధర 66.04 రూపాయల వద్ద నిలకడగా ఉంది. అటు వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ లీటరుకు 6 పైసలు తగ్గి 80.54 రూపాయలు గానూ, డీజిలు ధర 69.27రూపాయలుగానూ స్థిరంగా ఉన్నాయి.

ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు ఉదయం 6 గంటలకు నవీకరిస్తారు. దేశవ్యాప్తంగా ఈ విధానం రెండేళ్ళక్రితం అమలు లోకి వచ్చింది. అప్పట్నుంచీ ఇది కొనసాగుతోంది. ఈరోజు 6 గంటలకు మార్పు, చేర్పులకు గురైన పెట్రోల్, డీజిల్ ధరలను మీ సమాచారం కోసం అందిస్తున్నాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories