పెట్రోల్ ధర పెరిగింది..డీజిల్ ధర తగ్గింది..!

పెట్రోల్ ధర పెరిగింది..డీజిల్ ధర తగ్గింది..!
x
Highlights

దేశీయంగా పెట్రోల్ ధరలు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి..అయితే అదే క్రమంలో డీజిలు ధరలు తగ్గుతున్నాయి.

పెట్రోల్ ధర పెరిగింది..డీజిల్ ధర తగ్గింది.. దేశీయంగా పెట్రోల్ ధరలు పైపైకి వెళుతున్నాయి. అదేసమయంలో డీజిల్ ధరలు కింది చూపులు చూస్తున్నాయి. 11-11-2019 సోమవారం పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 19 పైసలు పెరిగింది. దీంతో 77.90 రూపాయలకు చేరింది. అయితే, డీజిల్ ధర కూడా లీటరుకు 7 పైసలు తగ్గి 71.86 రూపాయలకు చేరుకుంది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 77.51 రూపాయలు గానూ, డీజిల్ ధర 7 పైసలు తగ్గి 71.16 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర తగ్గింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగి 77.14 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 7 పైసలు తగ్గి, 70.82 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగితే, డీజిలు ధర లీటరుకు 6 పైసలు తగ్గింది. దీంతో, పెట్రోలు ధర 73.20 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.85 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగితే, డీజిలు ధర లీటరుకు 6 పైసలు తగ్గింది. దీంతో, పెట్రోల్ 78.87 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.07 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories