Petrol Price Today 05-11-2019: ఐదో రోజూ తగ్గిన పెట్రోల్! స్థిరంగా డీజిల్!!

Petrol Price Today 05-11-2019: ఐదో రోజూ తగ్గిన పెట్రోల్! స్థిరంగా డీజిల్!!
x
Highlights

వరుసగా ఐదో రోజూ పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. డీజిలు ధరలు మాత్రం స్థిరంగా నిలిచాయి.

నాలుగు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఈరోజు కుడా తగ్గాయి. ఇక డీజిల్ ధరలు మాత్రం ఎటువంటి మార్పూలేకుండా స్థిరంగా ఉన్నాయి. 05-11-2019 మంగళవారం పెట్రోల్ ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 5 పైసలు తగ్గి 77.26 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిల్ ధర స్థిరంగా 71.75 రూపాయల వద్ద ఉంది. అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 5 పైసలు తగ్గి 76. 89 రూపాయలు గానూ, డీజిల్ ధర మార్పులు లేకుండా 71.06 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర 5 పైసలు తగ్గగా , డీజిల్ ధర స్థిరంగా ఉంది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరు 76.53 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరు 70.72 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు తగుదల నమోదు చేయగా, డీజిలు యధాతథంగా ఉంది. దీంతో, పెట్రోలు ధర 72.60 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.75 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ లీటరుకు 5 పైసలు ద్గివచ్చింది. డీజిల్ నిలకడగా ఉంది. దీంతో, పెట్రోల్ 78.28 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 68.96 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories