Petrol Price Today: రెండు రోజుల తరువాత పెరిగిన పెట్రోలు ధరలు

Petrol Price Today: రెండు రోజుల తరువాత పెరిగిన పెట్రోలు ధరలు
x
Highlights

రెండు రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం పెరిగాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు ఈరోజు కొంచెం పెరగడం గమనార్హం. ఆదివారం తో పోలిస్తే సోమవారం పెట్రోల్ 9 పైసలు, డీజిల్ 10 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 79.11 రూపాయలకు చేరింది. డీజిల్ 73.39 రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 8 పైసలు పెరిగి 78.77 రూపాయలు గానూ, డీజిల్ ధర 9 పైసలు పెరిగి 72.71 రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 8 పైసలు పెరిగి రూ.78.40, డీజిల్ ధర 9 పైసలు పెరిగి 72.37 రూపాయలకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 8 పైసలూ, డీజిల్ 9 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 80.08 రూపాయలు, డీజిల్ 70.64 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 8 పైసలూ, డీజిల్ 9 పైసల మేర పెరగడంతో పెట్రోల్ ధర 74.42 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.33 రూపాయలుగానూ ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories