logo

Petrol Price Today: మళ్ళీ పెరిగిన పెట్రోల్ .. లీటరుకు 80 రూపాయల చేరువలో పెట్రోల్ ధరలు..

Petrol Price Today: మళ్ళీ పెరిగిన పెట్రోల్ .. లీటరుకు 80 రూపాయల చేరువలో పెట్రోల్ ధరలు..
Highlights

రెండో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు 80 రూపాయల చెరువులోకి వస్తోంది.

పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం పెరిగాయి. వరుసగా రెండో రోజూ పెట్రోల్ రేట్లు పెరగడం గమనార్హం. సోమవారం తో పోలిస్తే మంగళవారం పెట్రోల్ 14 పైసలు, డీజిల్ 12 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 79.25 రూపాయలకు చేరింది. డీజిల్ 73.51 రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 13 పైసలు పెరిగి 78.90 రూపాయలు గానూ, డీజిల్ ధర 12 పైసలు పెరిగి 72.83 రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 8 పైసలు పెరిగి రూ.78.40, డీజిల్ ధర 9 పైసలు పెరిగి 72.37 రూపాయలకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 13 పైసలూ, డీజిల్ 12 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 80.21 రూపాయలు, డీజిల్ 70.76 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 19 పైసలూ, డీజిల్ 16 పైసల మేర పెరగడంతో పెట్రోల్ ధర 74.61 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.49 రూపాయలుగానూ ఉంది.లైవ్ టీవి


Share it
Top