న్యూ ఇయర్ ఆఫర్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు వ‌న్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లు..!

న్యూ ఇయర్ ఆఫర్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు వ‌న్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లు..!
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

పాత ఏడాదికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా కొన్ని సెల్ ఫోన్ కంపెనీలు స్మార్ట్...

పాత ఏడాదికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా కొన్ని సెల్ ఫోన్ కంపెనీలు స్మార్ట్ ఫోన్ ప్రియులకోసం ప్రత్యేకమైన బంపర్ఆఫర్లను అందిస్తుంటాయి. దీంతో యువత తక్కువ ధరకు మంచి ఫీచర్లతో ఉన్న కొత్త ఫోన్లను వారి సొంతం చేసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు.

ఇదే కోణంలో మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్లస్ కస్టమర్లకోసం న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ప్రత్యేక సేల్‌ను ముందుంచింది. వ‌న్‌ప్లస్ 7టి, 7టి ప్రొ ఫోన్లను ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఆఫర్ ను జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగించనుంది. ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకున్నవారు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అంతే కాదండీ నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా కస్టమర్లకు అందిస్తున్నారు. దీంతో పాటుగానే వ‌న్‌ప్లస్ కేర్ కింద ఏడాది పాటు ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా ల‌భిస్తుంది.

ఇంకెందుకాలస్యం ఇప్పుడే ఈ ఫోన్ను మీ సొంతం చేసుకోండి. నూతన సంవత్సరం రోజున కొత్త ఫోన్ తో ఎంజాయ్ చేయండి.

ఇక వన్‌ప్లస్ 7టి ఫీచర్ల విషయానికొస్తే

♦ 2400 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

♦ 6.55 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే,

♦ ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్

♦ 8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌,

♦ యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్

♦ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్,

♦ 3డి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌

♦ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌,

♦ 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 48, 16, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,

♦ 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, వార్ప్ చార్జ్ 30టి ఫాస్ట్ చార్జింగ్

♦ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
Show Full Article
Print Article
More On
Next Story
More Stories