ఈ అర్థరాత్రి నుంచే మొబైల్ చార్జీల మోత.. ఎయిర్ టెల్, వోడాఫోన్ చార్జీలు ఎంత పెరుగుతాయంటే..

ఈ అర్థరాత్రి నుంచే మొబైల్ చార్జీల మోత.. ఎయిర్ టెల్, వోడాఫోన్ చార్జీలు ఎంత పెరుగుతాయంటే..
x
representational image
Highlights

ఇన్నాళ్లూ అపరిమిత కాల్స్ తో ఎంజాయ్ చేసిన మొబైల్ వినియోగ దారులకు నాలుగేళ్ల తరువాత చార్జీల షాక్ తగలనుంది.

మొబైల్ వినియోగదారులకు ఈ రోజు(02. 2.2019) అర్థ రాత్రి నుంచి చార్జీల మోత మోగనుంది. నాలుగేళ్లుగా ఎటువంటి చార్జీల పెంపుదల లేకుండా చౌక ధరల్లో మొబైల్ సేవలు అందిస్తున్న కంపెనీలు ధరలను విపరీతంగా పెంచాయి. అంతేకాకుండా ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ విషయం లోనూ పరిమితులు విధిస్తున్నాయి. దాదాపుగా ఈ పెరుగుదల 50 శాతం వరకూ ఉండడం గమనార్హం.

ప్రీపెయిడ్‌ చందాదార్లకు కాల్స్‌ డేటా ఛార్జీ (టారిఫ్‌)లు ఈనెల 8 నుంచి పెంచుతున్నట్లు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ ఆదివారం ప్రకటించాయి. నేటి (సోమవారం) అర్థరాత్రి 12 గంటల నుంచి ఛార్జీల " పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ విషయంలో పరిమితులు విధించాయి. ఆ పరిమితులు దాటి కాల్ చేస్తే నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధిస్తున్నట్టు తెలిపారు.

వోడాఫోన్, ఐడియా ఇలా..

డాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) 2, 28, 84, 865 రోజుల కాలవ్యవధితో అపరిమిత వినియోగం కింద ఉన్న ప్రస్తుత పథకాలకు కొత్త ఛార్జీలను ప్రకటించింది. వీటి పెరుగుదల 41.2 శాతం వరకు ఉంది. ప్రస్తుతం 865 రోజుల కాలపరిమితితో అపరిమిత కాల్ఫ్‌, 12 జీబీ డేటా పథకం రూ.998కి లభిస్తుండగా, ఇకపై 50 శాతం పెరుగుదలతో 2| జీబీ డేటా అందిస్తూ, రూ.1499 కానుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌తో 865 రోజుల కాలపరిమితి పథకానికి ఇప్పటివరకు రూ.1099 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.2899 అవుతుంది. 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటా లభించే అపరిమిత పథకం ధర రూ.458 నుంచి 81 శాతం అధికమై రూ.599కి చేరనుంది. అపరిమిత పథకాల కింద రోజుకు సంక్షిప్త సందేశాల (ఎన్‌ఎంఎన్‌) పరిమితిని కూడా 100కు, కాల్స్‌కు కూడా కాలవ్యవధికి అనుగుణంగా నిమిషాల పరిమితిని వర్తింప చేయనున్నారు.

భారతీ ఎయిర్‌టెల్‌

ప్రస్తుత పథకాల ఛార్జీల పెంపు రోజుకు 50 పైసల నుంచి రూ.28.85 వరకు ఉందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం 865 రోజుల కాలపరిమితితో అపరిమిత కాల్స్‌, 12 జీబీ డేటా పథకం రూ.908కి లభిస్తుండగా, ఇకపై 50 శాతం పెరుగుదలతో 2% జీబీ డేటా అందిస్తూ, రూ.1499 కానుంది. 2, 28, 84, 865 రోజుల | కాలపరిమితి కలిగిన అపరిమిత కాల్స్‌, డేటా వినియోగ ఛార్జీల పెరుగుదల 41.14 శాతం ఉండనుంది. అపరిమిత వినియోగ పథకాలే అయినా 28 రోజుల కాలపరిమితికి 1000 నిమిషాలు, 84 రోజులకు 8000 నిమిషాలు, 865 రోజులకు 12000 నిమిషాల మేర ఇతర నెట్‌వర్క్‌లకు ఉచితంగా కాల్‌ చేసుకోవచ్చు. ఇంతకు మించితే నిమిషానికి 6 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 11.5 జీబీ డేటా అపరిమిత కాల్స్‌ 865 రోజుల పథకం ధర రూ.1699 నుంచి రూ.2898 పెరగనుంది. ఇదేసేవలతో 84 రోజుల పథకం ధర రూ.458 నుంచి 588 కానుంది.

జియో

జియో నెట్ వర్క్ కూడా 40 శాతం మేర ధరలను పెంచింది. అపరిమిత కాల్స్ విషయంలోనూ చార్జీలను వేసింది. కాకపోతే తమ చందాదారులకు 300 శాతం అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్టు వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories